ప్రేమకి, బంధానికి, పౌరుషానికి నిదర్శనం మనుషులు. ఇలాంటి మనిషికి ఎప్పుడూ ముందు చూపే కాదు, అప్పుడప్పుడు వెనుక చూపు కూడా అవసరం. ఎందుకంటే వెనకచూపు లేకపోవడం వల్ల వచ్చే ప్రమాదాలను పసిగట్టడం కష్టం. ఇకపోతే గాంధీ గారు మనకు చెప్పిన మూడు కోతుల కధ తెలుసుకదా.. అదంతా ఒకెత్తు ఐతే, ఆయన చెప్పని ఈ నాలుగో కోతి మరోక ఎత్తు అనిపిస్తుంది.. అందుకే ఇలాంటి కోతులతో పారాహుషార్.


అయితే మనుషులే కాదు కోతులకు కూడా పౌరుషం ఎక్కువే అనిపిస్తుంది. కోతులతో ప్రేమగా ఉన్నా వాటి మూడుబట్టి అవి ప్రవర్తిస్తాయి.. కానీ వాటికి గనుక కోపం వచ్చిందంటే మనుషులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు మనకు కనిపిస్తాయి.. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా ఇలాంటిదే. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత నంద పోస్ట్ చేసిన ఈ వీడియోలో కనిపించే కోతి చేసిన పనికి భయంతో పాటుగా నవ్వు కూడా వస్తుంది.


ఇక మనుషులను రెచ్చగొడితే కొట్లాటే అవుతుంది. కానీ కోతిని రెచ్చగొడితే తన్నులు తినడం మాత్రం ఖాయం అని నిరూపిస్తుంది ఈ వీడియోలోని సంఘటన.. ఇక్కడ కనిపించే దృశ్యంలో ఒక డస్ట్ బిన్ దగ్గర కోతి తనపని తాను చేసుకుంటుంది. ఇంతలో అటుగా వెళ్లుతున్న ఓ యువకుడు ఆ కోతిని ఏమని రెచ్చగొట్టాడో తెలియదు గానీ నా కొడక నీ సంగతి ఇలా కాదని ఆ కోతి ఎగిరి రెండు కాళ్లతో జాకీచాన్ రేంజ్‌లో ఒక్క షాట్ ముఖం మీద ఇచ్చింది..


అంతే ఆ దెబ్బకు భూమి గుండ్రంగా తిరుగుతుందన్న విషయాన్ని మరచినట్లుగా లేచి నిల్చున్న ఆ వ్యక్తి కోతి ఇచ్చిన షాట్‌కు గమ్మున నోరు మూసుకుని తన దారిన తాను వెళ్లిపోయాడు.. కోతి మాత్రం అతను వెళ్లిన వైపే చూస్తూ మర్కటముతో పెట్టుకుంటే మటాషే అని ఓ చూపు విసిరింది.. కాగా నవ్వులు పూయించే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: