ఒకప్పుడు తెలుగు ప్రజలందరినీ ఉర్రూతలూగించిన జానపదాలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయ్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు జానపదాన్ని బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో జానపద గీతాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇక సినిమా పాటల కంటే ఎక్కువగా ఈ జానపద గీతాలు  ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయ్. అయితే ఇటీవలి కాలంలో అందరి హృదయాలను తాకి.. ప్రతి ఒక్కరి నోటా వినిపించిన జానపద గేయం ఏది అంటే అందరు టక్కున చెప్పేస్తారు సారంగదరియా అని. సారంగదరియా  అనే జానపద గేయం ఎప్పటినుంచో ప్రజలకు తెలుసు. కానీ ఈ పాటకు మరింత మెరుగులు దిద్ది ఇటీవలే  విభిన్నమైన దర్శకుడు శేఖర్ కమ్ముల తన సినిమా లవ్ స్టోరీ లో పెట్టాడు.



 దీంతో ఇక ఈ పాట విన్న తెలుగు ప్రజల హృదయాలు పులకించిపోయాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ పాట అటు సోషల్ మీడియాను కూడా ఊపేసింది.  ఈ పాట విడుదలై ఎన్నో  రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంది అని చెప్పాలి.  ప్రస్తుతం ఇక ఈ పాట వింటే చాలు తెలుగు ప్రేక్షకులు హృదయం పులకించి పోతుంది. అంతలా ఈ జానపదం గుర్తింపు సంపాదించింది. అయితే ఇక ఈ జానపద గేయాన్ని తెలుగు సింగర్స్ పాడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఒక కొరియర్ యువతి ఈ జానపదగేయం పాడితే.


 కొరియన్ యువతికి తెలుగు రాదు కాబట్టి సారంగదరియా అనే అద్భుతమైన పాటను కూని చేస్తుంది అని చెబుతారు ప్రతి ఒక్కరు. అలా అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇక్కడ కొరియర్ యువతీ పాడిన పాట వింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే. లవ్ స్టోరీ సినిమాలో మంగ్లీ పాడిన సారంగదరియా పాట కొరియన్ యువతీ పాడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తెలుగు రాకపోయినప్పటికీ ఎంతో అద్భుతంగా సారంగదరియా పాటను పాడి తెలుగు ప్రజలందరికీ ఫిదా చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: