పెట్రోల్ డీజిల్ ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు 60, 70 రూపాయలకు మాత్రమే దొరికిన లీటర్ పెట్రోల్.. ఇక ఇప్పుడు వంద రూపాయలకు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక సామాన్య ప్రజలు అందరూ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్నారు అని చెప్పాలి. మొన్నటికి మొన్న కరోనా వైరస్ సమయంలో ఇక ఎలాంటి కాంటాక్ట్ ఉండకూడదు అని చెప్పిన నేపథ్యంలో.. నగదు లావాదేవీలు వదిలి నగదు రహిత లావాదేవీల వైపు నడిచి నడిచినట్లు గానే.. ఇక ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాలను వదిలిపెట్టి విద్యుత్ తో నడిచే వాహనాలు వైపు అందరూ మొగ్గుచూపుతున్నారు అన్న విషయం తెలిసిందే.


 కేవలం నగరాలలో మాత్రమే కాదు పట్టణాలు చిన్న చిన్న గ్రామాలలో సైతం ప్రస్తుతం ఇలా ఎలక్ట్రికల్ స్కూటర్ లు వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉండడంతో ఎంతోమంది ఎలక్ట్రికల్ స్కూటర్ లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు అని నమ్ముతూ ఉన్నారు. కానీ ఎలక్ట్రికల్ స్కూటర్ ల ద్వారా కూడా ప్రమాదం పొంచి ఉంది అన్నది ఇక్కడ జరిగిన ఘటన చూసిన తర్వాత తెలుస్తుంది.

 ఇంతకీ ఏం జరిగింది అంటే.. ఓలా s1 ప్రో ఎలక్ట్రికల్ స్కూటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనదారులు షాక్ లో మునిగిపోయారు.  దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. మహారాష్ట్రలోని పూణే లో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్క్ చేసి ఉన్న ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పోయాయ్ అనేది తెలుస్తుంది. కాసేపటికే ఎలక్ట్రికల్ స్కూటర్ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఇలా ఎందుకు మంటలు చెలరేగాయి అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. లిథియం ఇయాన్ బ్యాటరీ డ్యామేజ్ ఇవ్వడం వల్లనే షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి ఉంటాయి అని భావిస్తూ ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: