సాధారణం గా వీధిలో నడుస్తున్నప్పుడు కుక్కలు దాడి చేయడం లాంటివి జరుగుతుంటాయి. అందుకే ఎక్కువ మంది వీధిలో నడుస్తూ ఉన్నప్పుడు కాస్త జాగ్రత్త గానే ఉంటారు. చుట్టుపక్కల ఏవైనా కుక్కలు ఉన్నాయేమో అని చూస్తూ ఉంటారు. అయితే ఇటీవలే  కాలంలో వీధుల్లోకి వెళ్లినప్పుడే కాదు లిప్ట్ లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా కుక్కలు దాడి చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నేటి రోజుల్లో కుక్కల ని పెంచుకోవడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరూ కుక్కలను పెంచుకుంటూ ప్రేమగా చూసుకుంటున్నారు..


 కుక్కలు యజమానులకు విశ్వాసం గానే ఉంటున్నప్పటికీ అభం శుభం తెలియని వారిపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు మాత్రం సోషల్ మీడియాలో అందరినీ భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో లిఫ్ట్ లో ఓ బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసి గాయపరిచిన ఘటన ట్విట్టర్ వేదికగా ఎంతలా వైరల్ గా మారిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలుడిపై కుక్క దాడిచేసి గాయపరిచినప్పటికీ.. ఆ బాలుడు నొప్పితో విలవిలలాడిపోతూ ఉన్నప్పటికీ ఆ కుక్క యజమాని మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం మరింత సంచలనంగా మారిపోయింది.



 అయితే ఇటీవలే ఘజియాబాద్ లో జరిగిన ఘటన గురించి మరవకముందే దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏథెనా సొసైటీ లిఫ్టులో అబ్బాయి  ఎక్కాడు. లిఫ్ట్ లో అప్పటికే కుక్క తో యువకుడు ఉన్నాడు. అయితే ఆ పెంపుడు కుక్క ను చూసిన అబ్బాయి భయపడుతూనే లిఫ్టులో వుండిపోయాడు. కుక్క యజమాని కుక్కను తీసుకుని లిఫ్ట్ దిగేముందు ఆ బాలుడి పై కుక్క దాడి చేసి కరిచింది. దీంతో ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు బాధితుడు. కుక్కను అదుపు చేసేందుకు యజమాని బయటకు తీసుకెల్లాడు.. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: