ఇక ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్‌లాండ్‌ దేశం వరుసగా ఆరోసారి ఎంపికై సూపర్ రికార్డు నెలకొల్పింది. మొత్తం 150కిపైగా దేశాల్లో చేపట్టిన సర్వే ఆధారంగా ర్యాంకింగ్‌ లిస్టును రూపొందించడం జరిగింది.మార్చి 20 వ తేదీన ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి సోమవారం నాడు వార్షిక యూఎన్‌ స్పాన్సర్డ్‌ ఇండెక్స్‌ 2022ను రిలీజ్ చేసింది. ఈ లిస్టులో దాయాది దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్‌, చైనాలకంటే భారత్‌ దిగువన ఏకంగా 126వ స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ 108వ ర్యాంక్‌లో ఉండగా, శ్రీలంక మాత్రం 112వ ర్యాంక్‌లో ఉంది. అయితే గత సంవత్సరం కంటే మన దేశం ర్యాంక్‌ మెరుగుపడిందని చెప్పవచ్చు. 2021 వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్టులో ఇండియా 136వ ర్యాంక్‌లో ఉండగా ఈ ఏడాది మొత్తం 10 పాయింట్లు కోల్పోయి 126వ ర్యాంకుకు చేరుకుంది.ఇక రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో ఆ దేశాల ర్యాంకులు బాగా పతనమయ్యాయి.


రష్యా 72వ స్థానంలో ఉండగా ఇంకా ఉక్రెయిన్‌ 92వ స్థానంలో ఉంది.ఇక నార్త్ ఐరోపా దేశమైన డెన్మార్క్‌ ఏకంగా రెండవ స్థానంలో ఉంది. గత సంవత్సరం కంటే ఐదు స్థానాలు ఎగబాకి అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. వేలాది నదులు, దేశమంతా పచ్చని అడవులు ఇంకా 5.5 మిలియన్ల జనాభా కలిగిన ఫిన్లాండ్ అత్యంత సంతోహకరమైన దేశంగా ఎంపిక కావడం వెనుక గల కారణం ఏంటంటే..ఆ దేశ విస్తృతమైన సంక్షేమ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని నివేదికలో వెల్లడించింది. నమ్మకమైన పాలనా యంత్రాంగం అలాగే దేశ జనాభాలో తక్కువ స్థాయిలో అసమానతలున్నట్లు తెల్పింది. ఒక దేశ హ్యాపీనెస్‌ను సామాజిక మద్దతు, ఆదాయం, ఆరోగ్యం, స్వేచ్ఛ, దాతృత్వం ఇంకా అవినీతి అనే ఆరు కీలక అంశాలను నివేదిక పరిగణనలోకి తీసుకుంటుంది. మూడేళ్ల వ్యవధిలో సగటు డేటా ఆధారంగా హ్యాపీనెస్ స్కోర్‌ను ఆ దేశాలకు కేటాయించి ఇలా ర్యాంకులు ఏ దేశం ఎంత హ్యాపీగా ఉందో అంచనా వేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: