తల్లి ప్రేమను మించింది ఈ భూమి మీద ఇంకేది లేదు అని అందరూ అంటుంటారు. అనడం కాదు అదే అక్షర సత్యం అన్న విషయం ఎన్నో ఘటనల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అని చెప్పాలి. అయితే కేవలం మనుషుల్లోనే కాదు అటు సకల జీవరాశిలో కూడా తల్లి ప్రేమ ఒకే విధంగా ఉంటుంది అని నేటి రోజుల్లో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనల ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది. ఇక కడుపున పుట్టిన పిల్లలను ఆలనా పాలన చూసుకోవడమే కాదు పిల్లలకు ఏదైనా ప్రమాదం వస్తే తల్లి అపరకాలిలా మారిపోయి ప్రాణాలు ఇవ్వడానికి ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా తల్లి ప్రేమకు సాక్ష్యంగా నిలిచే ఘటనలు కోకోల్లలు. ఇక ఇటీవల సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ తల్లి ప్రేమ లాగానే జంతువుల్లో కూడా ఉంటుంది అని నిరూపించే ఎన్నో వీడియోలు ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోతూనే ఉన్నాయని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఇక ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ వీడియోలో ఏకంగా బిడ్డలో వచ్చిన చలనం చూసి ఆడ ఎలిఫెంట్ సీల్ ఆనంద పడిన తీరు ప్రతి ఒక్కరిని ఫిదా చేసేస్తుంది.
 ఆడ ఎలిఫెంట్ సీల్ అప్పుడే ప్రసవించింది. అయితే బిడ్డలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఎంతగానో ఆందోళన చెందింది. దిగాలుగా.. కన్నా ఒక్కసారి లే నాన్న అంటూ తన బిడ్డను కదిలించే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ఇక అచేతనంగా ఉన్న ఆ ఎలిఫెంట్ సీల్ పిల్లలో చలనం రావడంతో ఇక ఆ తల్లి ఎలిఫెంట్ సీల్ ఒక్కసారిగా మురిసిపోయింది అని చెప్పాలి. సంతోషంలో కేకలు కూడా వేసింది. ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోవడంతో తల్లి ప్రేమ గొప్పతనాన్ని చాటేలా ఈ వీడియో ఉంది అని నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: