అడవులకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఏకంగా చిరుత పులులు సంచరిస్తున్న ఘటన లు ఎంతగానో సంచలనంగా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా జనాభాసాల్లోకి వచ్చిన చిరుతల నుంచి రక్షణ కల్పించడానికి  అటవీ శాఖ అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. అయితే గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్కు సమీపంలో ఉన్న గ్రామాలలో మాత్రం కేవలం చిరుతపులు మాత్రమే కాదు ఇంకా ప్రమాదకరమైన పులులు సింహాలు కూడా సంచరిస్తూ ఉండడం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం.



 ఇలా జనావాసాల్లోకి పులులు సింహాలు వచ్చి అందరిని భయభ్రాంతులకు గురి చేస్తున్న వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. సాధారణంగా అడవికి రారాజుగా పిలుచుకునే సింహం కన్ను పడింది అంటే చాలు ఎంతటి జంతువు అయినా సరే దానికి ఆహారంగా మారిపోవాల్సిందే. అలాంటిది  పాడి పశువులపై సింహం దాడి చేస్తే ఇక ప్రాణాలతో బయటపడటం వాటి తరం కాదు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఏకంగా గ్రామంలో పశువులను వేటాడేందుకు ప్రయత్నించిన సింహాన్ని గ్రామ సింహం చివరికి తరిమికొట్టింది. ఆ వీధి కుక్క ధైర్యాన్ని చూసి ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి.



 వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఒక గ్రామ రహదారిపై భయంతో పశువుల మంద పరుగులు తీస్తుంది. ఇంతలో ఒక కుక్క మొరుగుతూ మందను వెంబడిస్తూ కనిపిస్తుంది. అయితే వెనక్కి తిరిగి చూస్తే ఆ కుక్క మరింత గట్టిగా మొరుగుతూనే ఉంది. మరొక వ్యక్తి చీకటి నుంచి కుక్కను సమీపిస్తున్నట్లు కనిపించింది. ఇక ఆ చీకటి రూపం దగ్గరికి వచ్చే వరకు కూడా కుక్క మొరుగుతూ ఇక చివరికి అక్కడి నుంచి పారిపోయింది. ఇక ఆ తర్వాత సింహం ఒక్కసారిగా కెమెరా కంట పడుతుంది. అప్పుడు గాని అర్థం కాలేదు సింహం నుంచి వీధి కుక్క పశువుల మందను కాపాడుతూ పరిగెత్తిస్తుందని. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: