కరోనా వైరస్ వల్ల ఎంతోమంది ప్రజలు అతలాకుతలమయ్యారు.. చాలామంది మరణించడం కూడా జరిగింది.ఇప్పుడు తాజాగా సరికొత్త వైరస్ రాబోతోందని అమెరికా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే ఈ కొత్త వైరస్ 2001లో మొదటిసారి వచ్చినట్లు గుర్తించారు.. ఆ తర్వాత 2018 లో కూడా తీవ్రంగా ఈ వైరస్ వచ్చిందని.. గ్లోబల్ హెల్త్ వారు 2020లో ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. 2018లో ఈ వైరస్ బారిన పడ్డవారు 1.40 లక్షల మందికి పైగా ఉన్నారట. అయితే ఇందులో 6 లక్షల మంది అస్వస్థకు గురయ్యారని తెలిపారు. ఐదేళ్లలో పిల్లలు 16,000 మంది మరణించినట్టుగా లాన్సేట్ గ్లోబల్ సంస్థ తెలియజేస్తోంది.


ముఖ్యంగా శ్వాస వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఈ వైరస్ ఉండబోతుందని హెచ్చరిస్తున్నారు .పెద్దవారిలో ఈ వైరస్ లక్షణాలు అంతగా కనిపించవు కానీ ముసలి వాళ్లు ఆస్తమాతో బాధపడేవారు ,పిల్లలపై ఇది చాలా తీవ్రమైన ప్రభావం చూపుతోందని యూఎస్ఏ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజన్ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ వైరస్ మాత్రం ఎప్పటికీ సోకుతూనే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ వైరస్ కు విరుగుడు కంపెనీ వ్యాక్సిన్లు తయారు చేయడం జరిగిందట.


ముఖ్యంగా కోవిడ్ 19 వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీని HMPV వ్యాక్సిన్ కూడా తయారుచేసి మొదటి ట్రయల్ పూర్తి చేసినట్లుగా తెలియజేయడం జరిగింది.. ఈ వైరస్ సోకినవారు ముసలివారు పిల్లలు ఎక్కువగా ఉన్నారట. చాలామంది ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలియజేశారు. మార్చిలో ఈ కేసులు భారీగా పెరిగిపోయాయని ఆ సమయంలో టెస్టులు జరపగా 11 శాతం మందికి పాజిటివ్ వచ్చిందని అమెరికా జయనరల్ వైద్యులు తెలియజేశారు.


ఈ వైరస్ సోకిన వారికి ఎక్కువగా జలుబు వస్తుందట. ఇది రెండు నుంచి ఐదు రోజుల వరకు ఉంటుందట. అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారికి ఎక్కువ సమస్య వస్తుందట. దగ్గు, జ్వరం కూడా ఉంటుంది ముక్కు రంధ్రాలు మూసుకుపోతాయట. దీంతో శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుందట. అయితే కరోనా జాగ్రత్తలు ఈ వైరస్ కి కూడా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: