
ముఖ్యంగా అడవుల్లో ఉండే సింహాలు, పులులు లాంటివి ఎంత భయంకరంగా వేటాడుతాయో అన్న విషయాలను కూడా వీడియోల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఇక భారీ ఆకారంతో కనిపించే ఏనుగు చేసే చిలిపి పనులు గురించి తెలిసి అప్పుడప్పుడు తెగ నవ్వుకుంటూ ఉంటారు నేటిజన్స్. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా ఏనుగు పిల్లలు ఇక తల్లిదగ్గర అచ్చం మనుషుల్లాగానే అల్లరి చేయడం ఇప్పటికే ఎన్నో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ఇప్పుడు మరో ఏనుగు పిల్ల అల్లరి చేసిన వీడియో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారు అని చెప్పాలి. సాధరణంగా ఏనుగు పిల్లలు తొండంతో ఇక శరీరంపై నీళ్లు చల్లుకొని ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ఏనుగు పిల్లకి ఆడుకోవడానికి తోడు దొరకలేదేమో ఏకంగా తన తొండాన్ని గింగిరాలు తిప్పుతూ ఆడుకుంటుంది ఏనుగు పిల్ల. ఇలా ఎవరు తోడు లేకపోయినా తనంతట తానే ఆడుకుంటున్న ఆ ఏనుగు పిల్లను చూసి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కెయ్యండి.