అడవుల్లో ఉండే అతి క్రూరమైన భయంకరమైన జంతువులలో పులులు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అడవికి రారాజు అయిన సింహం తర్వాత ఆ రేంజ్ బలాన్ని కలిగి ఉండేది పులి మాత్రమే అని అందరూ చెబుతూ ఉంటారు. అయితే పులి బోన్ లో ఉన్న పులే. ఇక వేటాడి ఆహారాన్ని సంపాదించుకోవడం పులి నర నరానా ఇమిడి పోయి ఉంటుంది అని చెప్పాలి. ఇలా సింహాలతో పోల్చి చూస్తే పులులే ఇక ఆహారాన్ని వేటాడి సంపాదించుకోవడానికి తెగ ఆరాటపడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఒక్కసారి పంజా విసిరింది అంటే పులి ప్రాణాలను తీసేస్తూ ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం ఇవి అర్థం కావు. ప్రమాదకరమైన పులికి కాస్త దగ్గరగా వెళ్లి అనుకోని ప్రమాదాలను కొనితెచ్చుకుంటూ ఉంటాయ్ అని చెప్పాలి. బోన్ లో ఉన్న పులి అంత ప్రమాదం కాదు అనుకుని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు.  ఏకంగా కుక్కనో పిల్లినో ముద్దు చేస్తున్నట్లు ప్రమాదకరమైన పులిని ముద్దు చేస్తూ చివరికి ప్రమాదంలో పడిపోతూ ఉంటారు ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఎంతోమంది అమ్మాయిలు కుక్కలను  ప్రేమగా పెంచుకోవడం చూస్తూ ఉంటాం.. ఇలా తమ పెట్స్ ని ఎంతో గారాభం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక అమ్మాయి మాత్రం ఏకంగా పులితోనే ఆటలు ఆడింది. పులి తల నిమిరి  చివరికి చిక్కుల్లో పడింది ఇక్కడ అమ్మాయి. పులి తలపై చేయి వేసి నిమిరింది . తర్వాత కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయిన పులి.. ఒక్కసారిగా ఆమె చేయిని నోట కరచి పెట్టుకుంది. అయితే పులికి ఆమెపై ప్రాణాలు తీసేటట్టు దాడి చేసే ఉద్దేశం లేదు అన్న విషయం మహిళలకు అర్థమైనా.. ఇక పులి తన చేతిని నోట కరుచుకోవడంతో ఒక్కసారిగా ఆమె గుండె జారిపోయినంత పని అయింది. ఈ క్రమంలోనే పులి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పులి మరింత గట్టిగా పట్టుకుంది. ఒకవేళ పులి నాలుకకు రక్తం రుచి తగిలితే పరిస్థితి చేయి దాటి పోయేది అని చెప్పాలి. ఈ క్రమంలోనే చాకచక్యంగా వ్యవహరించిన మహిళ పులి నుంచి చేయని బలవంతంగా లాగే ప్రయత్నం చేయకుండా.. ఓపికగా తల నిమురుతు  ఇక చేయని వదిలించుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: