ప్రేమ గుడ్డిది అని ఇప్పటికే చాలా సంఘటనలు నిరూపించాయి. తమకు కులమతాలతో పాటు వయసుతో కూడా సంబంధం లేదని ప్రేమికులు ఇప్పటికి కూడా నిరూపిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు మరో ప్రేమ విషయం ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది.ఇక అమెరికాకు చెందిన 24 ఏళ్ల కుర్రాడు తన బామ్మ వయసున్న ఓ 61 ఏళ్ల మహిళతో ప్రేమలో పడటం జరిగింది.ఇక ఆమె కూడా అతడిపై మనసు పారేసుకోవడం విశేషం. రామాక్రిష్ణా అంటూ శేషజీవితాన్ని గడిపేయాల్సిన ఈ ముసలావిడ ప్రేమకు వయసుతో సంబంధం ఏంటి అంటూ తన ప్రియుడితో చెట్టపట్టాలేసుకుని బాగా తిరుగుతోంది. ఇక దీంతో ఈ జంటను చూసినవారు అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. 

ఇక వివరాల్లోకి వెళితే.. ఈ 61 ఏళ్ల ముసలావిడ పేరు చెరిల్‌.. ఇక ఈమెతో ప్రేమలో పడ్డ ఆ యువకుడి పేరు మెక్ కెయిన్. ఇక వీరిద్దరి మధ్య ఏకంగా 37 సంవత్సరాల వయో భేదం అనేది ఉంది. ఇక చెరిల్‌ కుమారులలో ఒకరు మెక్ కెయిన్ కంటే కూడా చాలా పెద్దవాడు. ప్రస్తుతం ఈమెకు 17మంది మ‌న‌వ‌ళ్లు ఇంకా మ‌న‌వ‌రాళ్లు కూడా ఉన్నారు.అయితే మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటూ సమయం గడపాల్సిన ఈ ముసలామె .. ఆమెకి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ డాన్స్ చేస్తూ టిక్ టాక్ లో వీడియోలు బాగా చేస్తుండేది. ఇక ఆమె ఆ వీడియోలను మెక్ కెయిన్ షూట్ చేస్తుండేవాడు. ఇక అలాగే మెక్ కెయిన్‌కి 15 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడే.. చెరిల్‌తో మంచి స్నేహబంధం అనేది ఏర్పడింది. ఇక వారి స్నేహం ప్రేమగా చిగురించడానికి కొంత సమయం దాకా పట్టిందట.అది గట్టి ప్రేమగా మారిపోయిందట.ఆల్రెడీ వీరికి నిశ్చితార్ధం కూడా అయిపోయిందట. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.ప్రస్తుతం వీరి ప్రేమ కథా నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: