నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అందరికీ తెలిసిందే .ముఖ్యమైన వనరులు వృధా కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తపడాలి. అయితే ఇటీవల వాస్తవానికి సంబంధించిన అవగాహన కల్పిస్తూ.. జల శక్తి మంత్రిత్వ శాఖ.. బోరింగు నుంచి నీటిని తాగుతున్న ఒక ఏనుగుకు సంబంధించిన వీడియోని తీసి ట్విట్టర్లో షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ఈ 26 సెకండ్లు కలిగిన వీడియో క్లిప్ లో ఏనుగు బోరింగ్ సహాయంతో తనకు కావలసిన నీటిని తీసుకొని, తాగిన తర్వాత తన దాహార్తిని తీర్చుకుంది. ఎక్కడ ఒక నీటి బిందువు కూడా ఏనుగు వృధా చేయకుండా ,చక్కగా దాహం తీర్చుకుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఎక్కడా చూసినా నీటి వృధా జరుగుతూనే ఉంది. ఇక ఈ సమస్యను అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సమస్యను తగ్గించ లేకపోతున్నారు.

ఇటీవల జల శక్తి మంత్రిత్వ శాఖ నుంచి అమృత్ మహోత్సవ్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ కింద ఇలా ట్వీట్ చేయడం జరిగింది. ఏనుగు ఒక జంతువు అయినప్పటికీ ప్రతి నీటి చుక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంది.. అన్నీ తెలిసిన ప్రజలెందుకు సహజవనరుల విలువను తెలుసుకోలేకపోతున్నారు.. రండి..!  మీరు కూడా ఈ ఏనుగు నుండి నీటి సంరక్షణ ఎలా చేయాలో నేర్చుకోండి.. అంటూ ..ఆయన కింద క్యాప్షన్ రూపంలో పెట్టడం జరిగింది.

నిజమే కదా..! అని ఈ వీడియో చూసిన వారంతా అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే జంతువులకు సహజ వనరుల ప్రాముఖ్యత చాలా తెలుసు.. కాబట్టే, అవి ప్రతిదీ చక్కగా వినియోగించుకున్నాయి.. కానీ ప్రజలు మాత్రం సహజ వనరులను ఉపయోగించకుండా వృధా చేస్తున్నారు.. ఫలితంగా భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, పలువురు అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: