చాలామందికి కుక్కలను పెంచుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది అన్న ఈ విషయం తెలిసిందే.. కుక్కలను పెంచేవారికి కొన్ని హానికరమైన బ్యాక్టీరియా తో ముప్పు తప్పదని పలు అధ్యయనాలు ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.. అయితే ఎన్ని అధ్యయనాలు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఈ కుక్కలు పెంచుకోవడం మాత్రం మనుషులు మానుకోవడం లేదు.. ఇకపోతే కేవలం ఈ ముప్పు కుక్కలు పెంచే వారికి మాత్రమే కాదు గడ్డం పెంచే వారిలో కూడా ఎక్కువగా ఉంటుందట..


తాజాగా జరిపిన ఒక సర్వేలో పురుషుల గడ్డం లో.. పెరిగే బ్యాక్టీరియా.. కుక్క శరీరం మీద ఉండే బొచ్చు లో పెరిగే బ్యాక్టీరియా కంటే అత్యంత ప్రమాదకరమట.. ఇది చాలా ప్రమాదకరమైనది అని కూడా చెబుతున్నారు పరిశోధకులు..పోయిన సంవత్సరం పశువైద్య  పరీక్షలకోసం వాడే ఎం.ఆర్.ఐ.స్కానర్ ద్వారా కుక్కల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధులు వల్ల మనుషులకు ఏదైనా ప్రమాదం ఉందా లేదా అని తెలుసుకోవడానికి పరిశోధకులు కొన్ని పరిశోధనలు కూడా నిర్వహించారు.. ఈ నేపథ్యంలోనే కుక్కల బొచ్చు లో పెరిగే బ్యాక్టీరియాను కూడా పరిశీలించడం జరిగింది.


ఈ విధంగా ఈ మధ్య కాలంలో పురుషులు ఎక్కువగా గడ్డం పెంచుకుంటున్న విషయం తెలిసిందే.. ఎందుకంటే పురుషులు పెంచుకునే గడ్డం లో పెరిగే బాక్టీరియాపై కూడా పరిశోధకులు జరిపిన సర్వే తర్వాత విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ఈ పరిశోధనలో భాగంగా నే 18 మంది పురుషుల గడ్డాన్ని, 30 కుక్కలకు మెడ వద్ద ఉండే బొచ్చును కూడా తీసుకొని పరిశీలించారు. కుక్కల బొచ్చు తో పోల్చుకుంటే పురుషుల గడ్డం నుంచి సేకరించిన నమూనాలలో ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారు.. 18సంవత్సరాల నుంచి 76 సంవత్సరాల వయసు కలిగిన పురుషుల్లో ఈ సూక్ష్మజీవులు అధికంగా వారి గడ్డలలో పెరుగుతున్నాయి.. కాబట్టి గడ్డం పెంచే వారు ఇక నుంచి పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని పరిశోధకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: