పెరుగులో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే.. వేసవి కాలం అయినా సరే చలికాలమైనా సరే ఈ పెరుగు తినందే చాలా మందికి కడుపునిండిన స్వభావం కూడా కలగదు.. ముఖ్యంగా భోంచేసిన తర్వాత చివరి ముద్దగా పెరుగుతో తినడం అలవాటుగా ఉంటుంది.. ఈ అలవాటు చాలా మంచిది అంటున్నారు వైద్యులు.. పెరుగును తినేటప్పుడు కొంతమంది రకరకాల కాంబినేషన్లను పాటిస్తూ ఉంటారు. ఇలా కొన్ని రకాల కాంబినేషన్ ల వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు.. పెరుగులో కి మామిడి పండు తింటూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం.. అలా ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి.. అయితే పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఏమిటో ఒకసారి చదివి తెలుసుకుందాం..


పెరుగులో ప్రోటీన్, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6, విటమిన్ బి -12 అధికంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థ ను బలోపేతం చేయడానికి సహాయం చేసే మంచి బ్యాక్టీరియా ఈ పెరుగు వల్ల  పెంచుతుంది.అంతేకాదు  ప్రతి రోజు పెరుగు తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


1. పాలు - పెరుగు : ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మంచి బలాన్ని చేకూర్చే పదార్థాలు అయినప్పటికీ.. విడివిడిగా తీసుకుంటేనే మనకు ప్రయోజనాలు కలుగుతాయి . కానీ కొంత మంది పాలు తాగిన వెంటనే.. పెరుగు తింటూ ఉంటారు.. కానీ పెరుగు తిన్న వెంటనే.. పాలు తాగుతూ ఉంటారు.. ఇలా చేయడం వల్ల డయేరియా, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.

2. పెరుగు - చేపలు:
పెరుగు, చేపలు కాంబినేషన్ లో మనం తినకూడదు అని తెలిసిన విషయమే.. ఈ విషయం చాలామందికి కూడా తెలుసనే చెప్పాలి. ఒకవేళ చేపలు తిన్న తర్వాత పెరుగు తిన్నట్లయితే వాంతులు , జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

3. పెరుగు - ఉల్లిపాయ:
సాధారణంగా పెరుగుపచ్చడి లో ఈ రెండింటిని కలుపుతారు అన్న విషయం మనకు తెలిసిందే. కానీ ఉల్లిపాయలు వేడిని కలగజేస్తాయి..పెరుగు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది..కానీ ఈ  రెండు కలిపి తినడం వల్ల.. అలర్జీలు, వాంతులు , గ్యాస్ , అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: