ఇప్పటికే ఎన్నోసార్లు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మైదానంలో ఆటకు విరుద్ధంగా ప్రవర్తించి నిషేధానికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్ చేసి ఏకంగా రెండేళ్లపాటు నిషేధానికి గురయ్యారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం గా మారిపోయింది. చుట్టు కెమెరాలు ఉన్నాయి అన్న విషయాన్ని మర్చిపోయి బాల్ టాంపరింగ్ చేశారు ఇక ఇటీవలే టీ20 ప్రపంచకప్ లో కూడా ఆస్ట్రేలియన్ క్రికెటర్ పాట్ కమ్మిన్స్ ఇలాంటిదే చేయబోయాడు. కానీ చివరికి విఫలమయ్యాడు. ఇక ఇది కాస్త కెమెరా కంటికి చిక్కటం తో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇక ఇది చూసిన తర్వాత ఛీటింగ్ చేయాలంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తర్వాతే అన్నది మరోసారి రుజువైంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంకపై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. అయితే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్. ఈ సమయంలోనే బౌండరీ వైపు వెళ్తున్న బంతిని ఆపేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కాని కుదరలేదు. దీంతో ఏకంగా బౌండరీ ని వెనక్కి జరిపేందుకు ప్రయత్నించాడు. ఇక ఇది కాస్త అక్కడి కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కమిన్స్ ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి