ఇక ఓ రైలు ప్రయాణికుడు చైన్‌ లాగిన సందర్భం ఓ లోకోపైలట్‌ ప్రాణం మీదికొచ్చింది. మహారాష్ట్ర ముంబై సమీపంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ముంబై నుంచి బీహార్‌లోని ఛాప్రాకు వెళ్తున్న గోదాన్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక ప్రయాణికుడు అక్కడ వున్న ఎమర్జెన్సీ చైన్‌ లాగాడు.ఇక దీంతో ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఒక నది వంతెనపై ఆ రైలు ఆగడం జరిగింది. చైన్‌ లాగిన రైలు బోగి కింద ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్‌ చేస్తేనే ఆ రైలు అనేది కదులుతుంది.ఇక ఆ బోగి కింద ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్‌ చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌ సతీష్ కుమార్ చాలా రిస్క్‌ ని తీసుకున్నారు. రైలు ఇంజిన్‌లో ఉన్న ఆయన చాలా కష్టం మీద చివరన ఉన్న రైలు బోగికి చేరుకున్నారు. వంతెనపై రైలు ఆగి ఉండటంతో ఆయన చాలా ధైర్యం చేసి రైలు బోగి కిందకు వెళ్లి అక్కడ ఉన్న అలారం పరికరాన్ని ఆయన తిరిగి సెట్‌ చేశారు. ఘటనపై స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రైలు చైన్‌ని లాగాలని ట్విట్టర్‌ ద్వారా సూచించింది.



కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. లోకో పైలట్ చేసిన సాహసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా కానీ అక్కడ ప్రాణాలే పోయేలా అక్కడ పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన బెదరకుండా.. రైలును స్టార్ట్ చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నంపై ప్రశంసలు కురిపిస్తున్నారు వీడియో చూసిన నెటిజన్లు. మరెందుకు ఆలస్యం ఈ షాకింగ్ వీడియోను మీరూ కూడా చూసేయండి.ప్రస్తుతం ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ బాగా చక్కర్లు కొడుతోంది. ఇక ఇది చూసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: