మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం.. నకిలీ ఇంజనీర్లు కట్టే బిల్డింగులు ఇక ఇల్లు కట్టేందుకు వేసే ప్లాన్లు చిత్రవిచిత్రంగా కనిపిస్తూ ఉంటాయ్. కేవలం సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు సోషల్ మీడియా లోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా సిసి రోడ్డు వేసేటప్పుడు అధికారులు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అధికారులు సి సి రోడ్డు వేసే చోట బైక్ పార్క్ చేసి ఉంటే దానిని పక్కకు తీయడం కాదు అలాగే సి సి రోడ్డు వేశారు.


 ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. తమిళనాడులో ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వీడియో తీసిన సదరు వ్యక్తి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు అని చెప్పాలి. వెళ్లూరు మున్సిపాలిటీలో గాంధీ రోడ్డు ప్రాంతంలో మురుగన్ రోజు లాగానే సాయంత్రం తన బైక్ ని ఇంటి ముందు పార్క్ చేశాడు. తర్వాత బయటికి రాలేదు. అయితే రాత్రి నిద్రపోయి ఉదయం లేచి బయటికి వచ్చి చూసే సరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.


 రాత్రి అతను ఉంటున్న గల్లీలో సిమెంట్ రోడ్డు వేశారు. ఈ విషయం అతనికి కూడా తెలుసు. కానీ ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన బైక్ ని అలాగే పెట్టి సి సి రోడ్డు వేయడం గమనార్హం. దీంతో బైక్ ముందు వెనక టైర్లు స్టాండ్ సిమెంటు రోడ్డు లో చిక్కుకుపోయాయి.  రోజు ఇంటి ముందు బైక్ పార్క్ చేస్తానని..  11 గంటల వరకు కూడా నిద్రపోకుండానే ఉన్నాను. కానీ పిలవకుండా బైక్ అలాగే పెట్టి రోడ్డు ఎలా వేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం బైక్ విషయంలోనే కాదు రోడ్డుపై నీళ్లు డ్రైనేజీ లోకి వెళ్లి పైపులను కూడా మూసివేశారు అంటూ మండి పడుతున్నాడు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: