కుళ్ళు కుతంత్రాలతో నిండి పోయిన నేటి ప్రపంచం లో చిన్న పిల్లని చూస్తే ఎంతో ముచ్చటేస్తూ ఉంటుంది. ఎందుకంటే వారికి ఇంకా మనుషుల్లో కూరుకు పోయిన కుళ్లు కుతంత్రాలు గురించి తెలియదు. స్వచ్ఛమైన మనసుతో ప్రతి ఒక్కరిని ఒకే విధం గా చూస్తూ ఉంటారు. అందుకే చిన్న పిల్లలు ఏం చేసినా కూడా ఎంతో క్యూట్ గా అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లల చిరునవ్వు చూశాము అంటే చాలు అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా పోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక చిన్న పిల్లలు చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటీ తెగ చక్కెర్లు కొడుతుంది. సాధారణంగా వర్షం అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. వర్షం వస్తున్నప్పుడు హాయిగా వర్షం లో తడుస్తూ వర్షపు  చినుకులను ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేయడమంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు. కానీ జలుబు చేస్తుందని జ్వరం వస్తుందన్న భయంతో కొంతమంది వర్షానికి దూరంగానే ఉంటారు. కానీ ఎప్పుడో చిన్నప్పుడు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేసిన ఘటన మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అని చెప్పాలి.


 ఇలా చిన్నప్పుడు వర్షం లో సరదాగా తడిచిన  విషయాన్ని అందరికీ గుర్తు చేస్తుంది ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో. ఆ చిన్నారి ఆనందంతో రోడ్డు పైకి వెళ్లి వర్షంలో తడుస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. అతనిపై వర్షపు చినుకులు పడుతూ ఉంటే వాటిని ఆనందంగా ఆస్వాదిస్తూ రోడ్డుపై గింగిరాలు తిరిగి పోయాడు.  ఆ తర్వాత రోడ్డుపై కూర్చొని తెగ ఆనందపడి పోయాడు. ఇది చూస్తుంటే మేం కూడా ఒకప్పుడు కల్మషం లేని మనసుతో ఇలాగే బాల్యాన్ని ఎంజాయ్ చేశాము కదా అని ప్రతి ఒక్కరి మనసు పులకరించిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: