సాధారణంగా ఎంతోమంది జంతు ప్రేమికులు ఇక పక్షుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి రహస్య కెమెరాలను ఏర్పాటు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ రహస్య కెమెరాల కారణంగా ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఫారెస్ట్ అధికారులు కూడా సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ సీసీ కెమెరాలను జంతువులు అస్సలు కనిపెట్టలేవు. కానీ మరి కొన్నిసార్లు మాత్రం సీసీ కెమెరాలను కనిపెట్టి ఇక వాటి ముందుకు వచ్చి చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటాయ్ అన్న విషయం తెలిసిందే.


 ఇక్కడ ఇలాంటి తరహా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. రహస్యంగా ఏర్పాటు చేసిన ఒక సీసీ కెమెరా కు గుడ్లగూబకు సంబంధించి అందమైన దృశ్యాలు చిక్కాయి అని చెప్పాలి. రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరా ముందుకు మూడు గుడ్లగూబలు వచ్చాడు. అయితే అక్కడ కెమెరా ఉందని.. ముందుగా గమనించలేదు. ఎప్పటిలాగానే మూడు స్నేహితుల్లా కలిసి మెలిసి ఆడుకోవడం మొదలు పెట్టాయ్. ఇంతలో  ఒక గుడ్లగూబ ఇక్కడ సీసీ కెమెరా అమర్చి ఉంది అన్న విషయాన్ని గమనిస్తోంది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే కెమెరా వద్దకు పరిగెత్తుకుంటూ వస్తుంది.


 వెంటనే కెమెరా ముందుకు వచ్చి నిలబడిన గుడ్లగూబ ఇక్కడ ఏదో తేడాగా ఉంది అంటూ కిందికీ మీదికీ చూడటం మొదలు పెడుతుంది. ఈ క్రమంలోనే తన పెద్ద కళ్ళు మరింత పెద్దవిగా చేసి కెమెరా ను చూస్తుంది. ఈ క్రమంలోనే ఇలా ఏదో విచిత్రంగా ఉంది అని చిత్రంగానే గుడ్లగూబ ప్రవర్తిస్తుంది అని చెప్పాలి. ఇక గుడ్లగూబ ప్రవర్తన చూసి ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటూ ఉన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉన్నాయ్ అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్విట్టర్లో వైరల్ గా మారిన ఈ వీడియో పై ఒక లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: