సాధారణంగా కింగ్ కోబ్రా పేరు ఎత్తితే చాలు.. ప్రతి ఒక్కరిలో హడలు పుడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో ప్రమాదకరమైన పాములలో అటు కింగ్ కోబ్రా కూడా ఒకటి అని చెప్పాలీ. సాదరణ పాములను చూస్తే భయం కలిగితే కింగ్ కోబ్రాను చూస్తే వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే కింగ్ కోబ్రా విషం ఎంత ప్రమాదకరమైనదో అది చూడటానికి కూడా అంతే భయంకరంగా ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తనకు హాని కలుగుతుంది అని భావిస్తే క్షణాల వ్యవధిలో దాడి విషాన్ని వదిలేస్తూ ఉంటుంది అని చెప్పాలి.


 అయితే ఇండియాలో కింగ్ కొబ్రా లు చాలా తక్కువ  అది కూడా మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఇంకా తక్కువ అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో మాత్రం తెలుగు రాష్ట్రాలలో కింగ్ కోబ్రాలు ఎక్కువగా బయటపడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఏపీలోనే శ్రీకాకుళం జిల్లాలో ఒక భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది అని చెప్పాలి.  శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ముండ్ల గ్రామంలో సుమారు 12 అడుగుల కింగ్ కోబ్రాను చూసి హడలిపోయారు. రాచనాగు గ్రామానికి చెందిన దుర్యోధన చౌదరి ఇంట్లోకి బుసలు కొడుతూ వచ్చింది ఈపాము. ఇక స్థానికులు వెంటనే సోంపేటలో ఉండే పాములు పట్టేవారికి సమాచారం అందించగా వారు వచ్చి ఇక చివరికి  చాకచక్యంగా  పామును పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్గా మారింది.


 అయితే పాములు పట్టేవాళ్ళు కింగ్ కోబ్రాని ఎంతో చాకచక్యంగా పట్టుకుంటున్న సమయంలో ఇక కింగ్ కోబ్రా వారిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించింది. అయినప్పటికీ వారు ఇక ఎంతో అనుభవం ఉన్న నేపథ్యంలో చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అయితే కింగ్ కోబ్రా వేగంగా అటు ఇటు కదులుతూ ఉండడం చూసిన స్థానికులు అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: