సాధారణంగా అడవుల్లో పాములు తెగ తిరగేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా తిరుగుతూ తిరుగుతూ కొన్ని కొన్ని సార్లు దారితప్పి జనావాసాల్లోకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈక్రమంలోనే ఇలా జనాల మధ్యకి పాములు వచ్చినప్పుడు వాటిని చూసిన జనాలు తమకు ఎక్కడ హాని తల పెడతాయో అని ప్రాణాలు తీసేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం విషపూరితమైన పాములు జనావాసాల్లోకి వచ్చిన వాటిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.


 ఇళ్ల మధ్య ఎక్కడ పాము కనిపించినా కూడా స్నేక్ క్యాచర్లకు సమాచారం అందిస్తూ ఇక పాములను రక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఎన్నో విషపూరితమైన పాములు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఎన్నో తెరమేదికి వస్తున్నాయి. ముఖ్యంగా ఇక ప్రపంచంలోనే ఎంతో ప్రమాదకరమైన కింగ్ కోబ్రా లాంటి పాములు జనాభాసాల్లోకి వస్తూ అందరిని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. నేపాల్ దేశంలోని నవల పూర్ జిల్లా కవచోటి మున్సిపాలిటీకి చెందిన డైరీ గ్రామంలో ఇంట్లో భారీ కింగ్ కోబ్రా దూరింది.


 ఈ క్రమంలోనే కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. ఇక అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ 15 అడుగుల ఉన్న కింగ్ కోబ్రాను స్టిక్ సాయంతో బయటకు తీసుకువచ్చి ఎంతో చాకచక్యంగా దానిని ఒక కవర్లో బంధించాడు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆ కింగ్ కోబ్రాని వదిలేయగా.. పక్కనే ఉన్న కొలనులోకి దిగిన కింగ్ కోబ్రా క్షణాల వ్యవధిలో బుల్లెట్ వేగంతో ఈదుతూ మరో గట్టుకు దూసుకు వెళ్ళింది అని చెప్పాలి. ఇక ఇది చూసినవారు కింగ్ కోబ్రా ఇంత వేగంగా ఈద గలదా అని అవాక్కవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: