సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇక మన ముందు ఏదైనా పాము కనిపించింది అంటే చాలు ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది అనే విషయం తెలిసిందే. అయితే మన కళ్ళ ముందు కనిపించేది విషపూరితమైన పాము కాదు అని తెలిసినప్పటికీ కూడా అందరిలో పాముపై ఉండే భయం కారణంగా ఇక ఎందుకో పామును చూడగానే తెలియకుండానే మనసులో భయం పుడుతూ  ఉంటుంది. ఇక అలాంటిది పాము మన వైపే దూసుకు వస్తుంది అంటే చాలు ఇంకేముంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పని అవుతుంది. ఇలా జరిగింది అంటే అక్కడి నుంచి పరుగొ పరుగు అంటారు ప్రతి ఒక్కరు.


 ఇకపోతే ఇటీవల కాలంలో ఇక ఎన్నో విషపూరితమైన పాములు జనావాసాల్లోకి వస్తూ దాడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియో ఏదైనా తెరమీదకి వచ్చిందంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. సాధారణంగా చిన్నారులు పాములను చూస్తే భయపడిపోతూ ఉంటారు. చిన్నారూలేంటి పెద్దవాళ్ళు కూడా వనికి పోతూ ఉంటారు.


 అలాంటిది ఇక్కడ ఒక చిన్నారి మాత్రం ఎంతో భయంకరంగా ఉన్న నల్లటి పాముతో ఆటలు ఆడుకుంటూ ఉండటం చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఏకంగా పాము పాకుతూ వెళ్తున్న సమయంలో చిన్నారి ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఇది చూసినవారు ఇది నిజంగానే జరిగిందా లేకపోతే ఎడిట్ చేసారా అని కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఆ చిన్నారి పామును పట్టుకుంటూ ఉండగా ఆ పాము మాత్రం చిన్నారిపై దాడి చేయకపోవడం గమనార్హం. ఏకంగా ఇద్దరు స్నేహితులు కలిసి ఆడుకున్నట్లుగానే ఆ భయంకరమైన పాము ఆ చిన్నారి  ఇంట్లో ఆడుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: