చిన్న పాము వచ్చిందంటేనే కొంతమంది భయంతో ఎంతగానో వణికిపోతారు. అది 'కింగ్ కోబ్రా' లాంటి భయంకర పాము అయితే ఇంకేమైనా ఉందా..భయంతో వణికిపోయి చనిపోతారు. అత్యంత ప్రమాదకరమైన జంతువులు కూడా కింగ్ కోబ్రాలకు ఆమడ దూరంగా పారిపోతాయి. ఎందుకంటే భూమీద అత్యంత విషపూరిత పాము కింగ్ కోబ్రానే. ఈ పాము కాటుకు పెద్ద బలమైన ఏనుగు కూడా సులభంగా మరణిస్తుంది. సాధారణంగా అటవి ప్రాంతాలలో సంచరించే కింగ్ కోబ్రా చాలా సిగ్గరి అట.ఈ పాములు ఎవరి కంట దాదాపుగా పడవు. అయితే కింగ్ కోబ్రాను రెచ్చగొడితే మాత్రం ఖచ్చితంగా చాలా ప్రమాదకరంగా మారుతుంది. అది మూడో వంతు పడగెత్తి మరీ కాటేయడానికి మీదికి దూసుకొస్తుంది. ఒక్కోసారి స్నేక్ క్యాచర్‌లకు కూడా చుక్కలు చూపించి ఉచ్చ పోయిస్తుంది.ఇక అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఇక ముగ్గురు స్నేక్ క్యాచర్‌లు పొలాల మధ్యలో తిరుగుతూ కింగ్ కోబ్రా ఉండే బొరియను కనుగొంటారు.ఆ ముగ్గురు కలిసి ఆ బొరియను తొవ్వుతుండగా.. అక్కడ చిన్నపాటి రంద్రం కనిపిస్తుంది. కచ్చితంగా ఇందులో కింగ్ కోబ్రా ఉంటుందని నమ్మిన వారు బొరియను ఇంకా తవ్వుతారు. 


వారికి అందులో ఏకంగా ఓ 15 అడుగుల బ్లాక్ కింగ్ కోబ్రా కనిపిస్తుంది.ఇక స్టిక్ సాయంతో దాన్ని బయటికి తీయగా.. అది దెబ్బకు కాటేయడానికి మీదికి దూసుకొస్తుంది.ఇక ఆ ముగ్గురు స్నేక్ క్యాచర్‌లు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. బొరియలో మరో పెద్ద బ్లాక్ కింగ్ కోబ్రా కూడా బయటికి వస్తుంది.ఆ రెండో బ్లాక్ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ఇద్దరు స్నేక్ క్యాచర్‌లు రాగా.. అది కోపంతో కాటేయడానికి మీది మీదికి దూసుకొస్తుంది. అయితే తృటిలో వారు తప్పించుకుంటారు.అయినా కూడా అది అసలు ఆగదు. తోకను పట్టుకోవడానికి వస్తుండగా భారీ ఎత్తున పడగెత్తి మరీ అది దూసుకొస్తుంది. దాంతో ఇద్దరు స్నేక్ క్యాచర్‌లు దెబ్బకి భయంతో అక్కడి నుంచి పారిపోతారు.అయితే మరో స్నేక్ క్యాచర్‌ మాత్రం చాలా దైర్యం చేసి దాన్ని పట్టుకునేందుకు వస్తాడు. చివరకు అతను రెండో బ్లాక్ కింగ్ కోబ్రాను అదుపు చేస్తాడు. ఇక లేడీ స్నేక్ క్యాచర్‌ వచ్చి సంచి దాని తలపై వేసి బంధిస్తుంది. ఆపై మరో పామును కూడా ఆమె అలానే బంధిస్తుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: