
ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. ఏకంగా ఒక జింకను చిరుత పులి వేటాడింది. జింకను చిరుత పులి వేటాడడం కొత్తేమీ కాదు ఇలాంటివి ఎన్నోసార్లు జరిగాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమయ్యాయి. అయినా ఇందులో కొత్తేముంది అని అనుకుంటున్నారు కదా.. ఇంతకీ ఏం జరిగిందంటే.. చిరుత పులి జింకను వేటాడిన తర్వాత జింక ఇక ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంది. ఇలాంటి సమయంలోనే హైనా రూపంలో జింక ప్రాణాలను రక్షించే మరో జీవి వచ్చింది.
అదేంటి హైనాలు కూడా క్రూరమైన జీవాలే కదా. అవి కూడా జింకలను వేటాడుతాయ్. అలాంటప్పుడు ఇక హైనా ప్రాణాలకు రక్షణ ఎక్కడిది అంటారా.. అయితే జింకను వేటాడి తింటున్న చిరుతపులిని తరిమెందుకు హైనా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఈ రెండు పోట్లాడుకుంటున సమయంలో జింక అలర్ట్ అయింది. ఇంకేముంది సందు దొరికిందో లేదో అక్కడి నుంచి లేచి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పెట్టి ప్రాణాలను దక్కించుకుంది. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది. చిన్న గ్యాప్ లో తప్పించుకున్న ఆ జింక తెలివికి నెటిజన్స్ అందరు కూడా ఫిదా అవుతున్నారు.