
కూలి నాలి చేసుకుంటూ కడుపు నింపుకునే వారికి టమాటా కొనుగోలు చేయడం ఇక కష్టంగా మారిపోయింది. దీంతో ఇక టమాటా ధరలు అంతకంతకు పెరిగిపోతున్న తీరు సామాన్యులను బెంబలెత్తిస్తూ ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం మార్కెట్లో టమాట ధరలు 100 రూపాయల నుంచి 200 వరకు పలుకుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అయితే ఏకంగా 250 రూపాయల వరకు టమాటా ధర పెరిగిపోయింది అని చెప్పాలి. దీంతో ఎక్కడ చూసినా టమాటా గురించి చర్చ జరుగుతుంది. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేసిన కూడా ఇక టమాటా పై రకరకాల మీమ్స్ వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.
కొందరు యువకులు కూడా అటు పెరిగిన టమాటా రేట్లపై ఏదో ఒకటి కొత్తగా వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వైరల్ గా మారిపోతున్నాయి. ఇటీవల కొంతమంది యువకులు ఏకంగా టమాటాపై సాంగ్ చేశారు. ఈ సాంగ్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఇది చూసి అందరూ నవ్వుకుంటున్నారు. టమాటా లేని సాంబార్, పావు బాజీ, చికెన్ కర్రీ సూప్ దేన్నైనా ఊహించగలమా.. వాటి రుచి వస్తుందా.. అసలు టమాటా లేకుండా వంట అవ్వదే.. అంత డిమాండ్ ఉన్న టమోటా ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి.. ఇప్పుడు టమాటా ధనికులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్టుంది అని అర్థం వచ్చే లిరిక్స్ రాసుకొని పాట పాడుతూ డాన్స్ చేశారు. ఇది చూసే నెటిజన్స్ అందరు నవ్వుకుంటున్నారు.