మనుషులను అనుకరించడంలో గొరిల్లా చింపాంజీలకు మించిన జంతువులు లేవు అనడంలో సందేహం లేదు. ఇక ఈ రెండు జంతువులు ప్రవర్తన చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కోతి నుంచి మనిషి పుట్టాడు అన్నది నిజమే అన్న విషయం మరోసారి గుర్తుకు వస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా వీటి ప్రవర్తన కొన్ని కొన్ని సార్లు అచ్చం మనుషుల ప్రవర్తనను పోలి ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఏకంగా బట్టలు ఉతకడం వాహనాలు శుభ్రం చేయడం డాన్స్ లు చేయడం ఇలా అన్ని విషయాల్లో కూడా మనుషుల ప్రవర్తనను మక్కికి మక్కి దింపేస్తూ ఉంటాయి ఈ రెండు జంతువులు.


 ఈ క్రమంలోనే చింపాంజీ లేదా గొరిల్లాలు ఇలా మనుషుల్లా ప్రవర్తించాయి అంటే చాలు అందుకు సంబంధించిన వీడియోలు.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి. ఇక్కడ ఒక గొరిల్లాకు సంబంధించిన వీడియో..   ఇలాగే చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఏకంగా గొరిల్లా డాక్టర్ అవతారం ఎత్తింది. సాధారణంగా డాక్టర్ దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు.. ఇక అతనికి ఏం జరిగిందని.. డాక్టర్ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ గొరిల్లా కూడా అచ్చం డాక్టర్ లాగానే ప్రవర్తించింది. ఏకంగా గాయపడిన పక్షిని గొరిల్లా పరిశీలించిన తీరు చూసి నటిజన్స్ అందరు కూడా అవాక్కవుతున్నారు.


 ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఒక పార్క్ లో గాయపడిన పక్షి గొరిల్లా ఎన్ క్లోజర్  లో పడిపోయింది. ఇక తీవ్రంగా గాయపడటంతో గాల్లోకి ఎగరలేక పోతుంది పక్షి  అయితే దూరంలో ఉన్న గొరిల్లా పక్షిని గమనించి వేగంగా దాని దగ్గరికి వస్తుంది  పాపం పక్షికి ఇలా అయ్యింది ఏంటి అన్నట్లుగా వచ్చి ఏం జరిగిందో అని ఎంతో తీక్షనగా చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత డాక్టర్ లాగా పూర్తిగా పరిశీలిస్తూ ఉంటుంది. ఇక మెల్ల మెల్లగా ఆ పక్షిని చేతులతో అటు ఇటు కదిలిస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియో చూసిన నేటిజన్స్ గొరిల్లా డాక్టర్ లాగా మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
https://www.instagram.com/reel/C1FMna0tmBr/?igsh=YzZhZTZiNWI3Nw==

మరింత సమాచారం తెలుసుకోండి: