ఈ భూమి మీద టాలెంట్ ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు. కానీ ఒకప్పుడు తమ టాలెంట్ ను ఎక్కడ నిరూపించుకోవాలి.. ఎవరి ముందు ప్రదర్శించాలో తెలియక.. ఇక తెరమీదకి రాని వారు చాలామంది. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే తమ టాలెంట్ను నిరూపించుకునేందుకు ఒక మంచి వేదిక కోసం ఎదురుచూడాల్సిన అవసరమే లేకుండా పోయింది. అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోనే వేదికగా మారింది. ఈ క్రమంలోనే తమలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకొని దానిని సోషల్ మీడియాలో పెట్టి పాపులారిటీ సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు.


 ఈ క్రమంలోనే టెక్నాలజీ మీద అనుభవం లేని వారి సైతం వినూత్నమైన ఆవిష్కరణలకు కారణమవుతున్నారు అని చెప్పాలి. ఇలాంటి తరహా వీడియోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్ లోకి వచ్చి వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఈ మధ్య కాలంలో బైక్ లో ఎన్నో రకాల ఫీచర్స్  వస్తున్నాయి  ఏకంగా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా వెసులుబాటు ఉండేలా ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్నారు. అయితే ఇక భారీ ధర పెట్టి ఆ వాహనాలను కొనుగోలు చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో.. కానీ ఇతనే ఒక వినూత్నమైన ప్రయత్నం చేశాడు.


  బడా బడా కంపెనీలకు సైతం సాధ్యం కాని రీతిలో  అతను తన బైక్ ని ఏకంగా స్మార్ట్ గా మార్చేశాడు. అయితే అతను వాడేది ఎలక్ట్రికల్ బైక్ కాదు. కానీ దీంట్లో ఉన్న సౌకర్యాలు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతారు. వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే బైక్ ముందు భాగంలో ఎలక్ట్రిక్ బోర్డు కనిపిస్తుంది. ఇందులో బల్బ్ హోల్డర్ సాకెట్ స్విచ్ కూడా ఉన్నాయి. ఇక బైక్ కి హెడ్ లైట్లు లేకపోవడంతో ఓ సగటు పరుడు హెడ్ లైట్ లకు బదులు ఇలా స్విచ్ బోర్డులు సెట్ చేసుకున్నాడు. బల్బు మాత్రమే కాకుండా మొబైల్ చార్జర్ ను పెట్టుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంది. ఈ వీడియో చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. నీ క్రియేటివిటీ ఏంటి గురు మరి ఇంత పీక్స్ స్టేజ్ లో ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: