అయితే ఇలా టెక్నాలజీ మీద అతిగా ఆధారపడటం. కొన్ని కొన్ని సార్లు ఎన్నో అనర్థాలకు కూడా కారణం అవుతుంది అని చెప్పాలి. ఒకప్పుడు తెలియని ప్రాంతాలకు వెళ్లాలంటే ఇక ఇలా రోడ్డుపైన కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా రూట్ అడుగుతూ ముందుకు సాగే వారు ప్రతి ఒక్కరు. కానీ ఈ మధ్య కాలంలో గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి రావడంతో ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంటి దగ్గర గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకున్నామంటే చాలు.. అది చూపించిన నేవిగేషన్ ఆధారంగానే ఎంతోమంది ఇక తెలియని ప్రదేశాలకు సైతం ఎంతో సులభంగా చేరుకుంటున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో గూగుల్ మ్యాప్స్ మీద ఆధారపడని మనిషి లేడు అనడంలో సందేహం లేదు.
కానీ కొన్ని కొన్ని సార్లు ఈ గూగుల్ మ్యాప్స్ ఎంతో మందిని ప్రమాదంలో పడేస్తున్నాయి ఇటీవల ఏపీలో ఇలాంటి ఘటన జరిగింది. గూగుల్ మ్యాప్ ని నమ్మితే గంగలో కలిసినట్లే అనే నానుడికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. నున్నకు చెందిన గౌతం సొంతూరు లో వరదల కారణంగా 10 రోజులుగా వేరే ఊర్లోని బంధువులు ఇంట్లో ఉన్నాడు. నిన్న వరద తగ్గిందని ఇంటికి వెళ్లి కారులో తల్లిని తీసుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకుని విజయవాడ బయలుదేరాడు అయితే అది సావరం గూడెం, కేసరపల్లి మీదుగా దారి చూపించింది. ఆ మార్గంలో వరద ఉండడంతో చివరికి వారి కారు వరద నీటిలో చిక్కుకొని ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. కానీ సమయానికి స్థానికులు గమనించడంతో ఇక వారిని కాపాడగలిగారు.