సాధారణంగా కొంతమంది మహిళలు ఏ రోజున దీపం పెట్టిన పెట్టకపోయినా "శుక్రవారం" మాత్రం ఖచ్చితంగా దీపం పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.  ఎన్ని పనులున్నా సరే ఉదయం లేచి ఇల్లు వాకిల్లు శుభ్రపరచుకొని .. గడపకి పసుపు కుంకుమను పూజించుకొని రకరకాల బొట్లు పెట్టి పూవ్వులతో అలంకరించి ఇంట్లోనే పూజ గదిని శుభ్రపరచుకొని రకరకాల పూలతో అలంకరించి.. ధూపదీపాలతో పూజలు చేస్తూ నైవేద్యాలు పెడుతూ లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. అంతా ఇలానే ఉంటారు అని చెప్పలేము. కొంతమంది శుక్రవారం కాదు శనివారం కాదు ప్రతి రోజు దీపం పెడుతూ దేవుడినే తలుచుకుంటూ ఉంటారు.  మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు .


కానీ కొంతమంది ఆడవాళ్లు మాత్రం సోమవారం .. మంగళవారం.. బుధవారం ఇలా దీపం పెట్టినా పెట్టకపోయినా శుక్రవారం మాత్రం ఖచ్చితంగా దీపం పెడతారు . గురువారం సాయంత్రం నుంచే ఇల్లు వాకిల్లు శుభ్రపరచుకోవడం చేస్తూ ఉంటారు.  అయితే ఇలా చేయడం మంచిదే కానీ అన్ని రోజుల్లో కూడా దీపం పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు పండితులు . అంతేకాదు గురువారం సాయంత్రం నుంచి  శుక్రవారం తెల్లవారుజామున ఐదు లోపు దీపం వెలిగించగలిగితే అది చాలా చాలా పుణ్యఫలం ఇస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు కొంతమంది పండితులు .



సాధారణంగా దీపం అందరూ కూడా ఏడు తర్వాత తొమ్మిది తర్వాత ఇలా పెడుతూ ఉంటారు . కానీ అలా పెట్టిన పుణ్యఫలం రాదట.  బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపు సమయంలో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యం లభిస్తుందట . మరి ముఖ్యంగా ఆడవాళ్లు ఎవరైతే తమ భర్త సంపాదన డబుల్ కావాలి అని తమ ఫైనాన్షియల్ పొజిషన్ ఇంకా మెరుగుపడాలి అని కోరుకుంటున్నారో.. అలాంటి వాళ్ళు గురువారం సాయంత్రమే ఇల్లు వాకిళ్లు అన్ని శుభ్రపరచుకొని పూజ సామాగ్రిని శుభ్రపరచుకొని ..ఇంటిలో ఎటువంటి మైలుమట్టా లేకుండా శుభ్రంగా ఉంచుకొని ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసి.. పూజ గదిని శుభ్రమైన పూలతో అలంకరించుకొని పసుపు కుంకాల తో ధూపదీపాలతో నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా పుణ్యఫలం దక్కుతుంది అంటున్నారు పండితులు. అంతేకాదు భార్య ఒక్కటే ఈ పూజ చేస్తే సరిపోదు భార్యాభర్త ఇద్దరు కూడా కలిసి పూజ చేస్తే ఇంకా విశేషమైన పుణ్యం లభిస్తుంది అని వాళ్ళ దాంపత్యం ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు..!!


నోట్" ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ..కొందరు పండితులు అదే విధంగా సోషల్ మీడియాలో పొందుపరిచిన కొంత సమాచారాన్ని ఇక్కడ అందించడం జరిగినది.  ఇది ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం అని పాఠకులు గుర్తుంచుకోవాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: