
హత్యకేసులో యావజ్జీవ శిక్ష పడిన శ్రీకాంత్ జైల్లో ఉండగా, ఒక్కసారిగా నెలరోజుల పెరోల్ మంజూరు అయింది. పోలీస్ ఉన్నతాధికారులు ఎవరూ అనుమతించకపోయినా.. హఠాత్తుగా జీవో రావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రభుత్వమే సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు జరిపింది. చివరికి ఈ డ్రామా వెనుక ఉన్నది అరుణే అని తేలిపోయింది. అరుణ – శ్రీకాంత్ మధ్య సంబంధం అంతా బయటకు వచ్చింది. జైలులో ఉన్న లవర్ శ్రీకాంత్‌ను చూడటానికి, అతనితో సన్నిహితంగా గడిపేందుకు ఆమె ఎలాంటి రిస్క్‌కైనా వెళ్లిపోయింది. ఒకసారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్చిన సమయంలో నేరుగా వెళ్లి రొమాన్స్‌లో మునిగిపోయింది. అక్కడి పోలీసులు కూడా ఎలాంటి అడ్డు చెప్పలేదు.
వారిద్దరి కబుర్లు.. కౌగిలింతలు.. అన్నీ కెమెరాల్లో బంధం అయ్యాయి. ఆ వీడియోలు ఇప్పుడు బయటకొచ్చి సంచలనం రేపుతున్నాయి. ఇకపై ఈమెపై ఉన్న అనుమానాలు మరింత పెరిగాయి. ఎందుకంటే అరుణ భర్త అనుమానాస్పద స్థితిలో చనిపోయాడన్న వార్తలు వెలుగుచూస్తున్నాయి. ఆ మరణం వెనుక నిజమెంటి? పోలీసుల సహకారంతో ఇంతకాలం సేఫ్‌గా గేమ్ ఆడిందా? అనేవి హాట్ టాపిక్ అవుతున్నాయి. అరుణకు దగ్గరగా ఉన్న పోలీస్ అధికారులు ఎవరూ? రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు ఎంత వరకు వెళ్లాయి? అన్నది త్వరలో బయటకు రావచ్చని ఇంటెలిజెన్స్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే చూసిన మాయలేడీ డ్రామా.. నిజజీవితంలో నెల్లూరులో బహిర్గతమైంది.