జీవితం ఒక చిన్న సరస్సులా కనబడుతుంది... ఆలోచిస్తే ఒక మహా సముద్రంలా అనిపిస్తుంది. చూసే కోణాన్ని బట్టి, ఊహించే విధానాన్ని బట్టి జీవితం కనబడుతుంది. జీవితంలో ప్రతి సందర్భం మనకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది. నేర్చుకున్న దాన్ని అర్థం చేసుకొని సరైన మార్గంలో ముందుకు పోవడమే అసలైన జీవితం.