మనలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి ఇతరులపై కోప్పడుతూ ఉంటారు. ఆ తరువాత కోపంతో చేసే పనుల వల్ల అపరాద భావంతో క్రుంగిపోతూ ఉంటారు. జీవితంలో ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మన కోపమే మనకు శత్రువై విజయం సొంతం కాకుండా చేస్తుంది. జీవితం అనే యుద్ధంలో కోపం లాంటి బలహీనతలు విజయానికి దూరం చేస్తాయి. 
 
కోపం అనేది సహజమైన ఆరోగ్యకరమైన భావోద్వేగం. కానీ సందర్భాన్ని బట్టి కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. కోపం వల్ల మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలే మన కోపానికి కారణమవుతాయి. శరీరంలో ఉండే "మోనోమైన్ ఆక్సిడేస్ ఎ" అనే ఎంజైమ్ కూడా కోపానికి కారణమవుతుంది. 
 
"మోనోమైన్ ఆక్సిడేస్ ఎ" ఈ ఎంజైమ్ తక్కువ మోతాదులో ఉంటే ఎక్కువ కోపానికి గురవుతారని పరిశోధనల్లో తేలింది. యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం వల్ల కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. సంతోషాన్నిచ్చే పనులు చేయడం ద్వారా.... కంటి నిండా నిద్రపోవడం ద్వారా కోపాన్ని జయించవచ్చు. కోపాన్ని మనం అదుపులో ఉంచుకుంటే మీ శక్తిసామర్థ్యాల పట్ల మీకు నమ్మకం ఏర్పడుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఏ పనిలోనైనా సులభంగా విజయం సాధించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: