విద్యార్థులకు పరీక్షలు అన్నవి వారి ప్రగతిని మూల్యాంకనం చేసే సాధనాలు అని చెప్పవచ్చు. అయితే సంవత్సరమంతా కష్టపడి చదివిందంతా మెదడులో నిక్షిప్తం చేసుకొని పరీక్షల్లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చినప్పుడే ఆ విద్యార్థికి మంచి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి విద్యార్థులకు పరీక్షలు అనేవి చాలా కీలకం. అయితే కొందరు విద్యార్థులు పరీక్షలు గురించి ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఇంకొంతమంది పరీక్షలు వస్తున్నాయంటే చాలు ముందు నుండే వారిలో టెన్షన్ పెరిగిపోతుంది. ఈ కంగారులో చదివినదంతా కూడా మర్చిపోతుంటారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు ప్రముఖ విద్యా విశ్లేషకులు కొన్ని సూచనలు అందించారు. ఆ సలహాలు పాటించినట్లయితే పరీక్షల సమయంలో కలిగే ఒత్తిడి నుండి బయట పడి పరీక్షలను ప్రశాంతంగా రాయగలరు అని చెబుతున్నారు. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటగా విద్యార్థి చేయవలసిన పని, ఏ సబ్జెక్టు నైనా కూడా కష్టపడి చదవకూడదు. ఇష్టపడి చదివితేనే ఆ సబ్జెక్టు మీకు బాగా అర్థమవుతుంది. అందులోనే అంశాలు దీర్ఘకాలం మీకు గుర్తు ఉంటాయి.

* ఒకసారి చదివేశాను ఇప్పటికి బాగా వచ్చేసింది అని ఈజీ గా తీసుకోకూడదు. సాధన అనేది చాలా అవసరం. అప్పుడప్పుడు చదువుకున్న అంశాలను  తిరిగి మళ్లీ ఒకసారి రివైండ్ చేసుకుంటూ ఉండాలి.


* సమాధానాలను బట్టి పట్టకుండా, అర్థం చేసుకొని సొంతంగా రాయడానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలో రియాలిటీని విస్మరించకూడదు. అంటే చదివిన విశ్లేషణలకు అర్థం మారకుండా చూసుకోవాలి. సొంతంగా రాస్తున్నాం కదా అని ఎలా పడితే అలా రాయకూడదు.


* పరీక్షల కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అందుకోసం మెయిన్ పరీక్షల కన్నా ముందే ప్రాక్టీస్ కోసం ప్రశ్నపత్రాన్ని తయారుచేసుకుని ఆ ప్రశ్నలకు మీరు చదివింది గుర్తు చేసుకొని ఎంతవరకు సమాధానం ఇవ్వగలుగుతారు అన్నది చెక్ చేసుకోవాలి.


* ఇలా రెండు మూడు సార్లు చేయడం వల్ల పరీక్షలు అంటే కంగారు పోవడమే కాదు, అభ్యసనం పెరిగి సబ్జెక్టును బాగా గుర్తు పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది.


* ఒకవేళ పరీక్షలు అనగానే ఎంతగా సర్దిచెప్పుకుంటున్నప్పటికీ మీలో టెన్షన్ మొదలైనట్లు అయితే, మీ గురువులకు గాని తల్లిదండ్రులకు గాని మీ సమస్యను చెప్పి వారి సలహాలను సూచనలను తీసుకోవాలి.


* వీలైనంతవరకూ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకుంటూ ముందుకు సాగాలి.


* పరీక్షల్లో ప్రతి ఒక్క విద్యార్థికి మంచి మార్కులు రావడం కష్టం, తక్కువ మార్కులు వస్తున్నాయి కదా అని మిమ్మల్ని మీరు విమర్శించకోకుండా, తదుపరి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నించండి.


* అందరి విద్యార్థుల జ్ఞానం ఒకేలా ఉండదు. కాబట్టి అందరికీ గొప్ప ర్యాంకులు రాకపోవచ్చు, కానీ మీకు వీలైనంత వరకు ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి.

 
* నేటి తరంలో చదువు అన్నది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నా  విద్యకు ఉన్న ప్రాముఖ్యత మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరదు.

మరింత సమాచారం తెలుసుకోండి: