ఈ మానసిక ఆందోళన తారా స్థాయికి చేరుకుంటే డిప్రెషన్ లోకి వెళ్లి పోయే అవకాశం కూడా ఉంది. అది ఎంత ప్రమాదం అన్నది అందరికి తెలిసిందే. అయితే ఇలా జరగకుండా మొదట్లోనే మీరు ఏదో ఒక విషయంలో డిస్టర్బ్ అయినప్పుడే మానసిక ఒత్తిడికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మీరు తక్కువ సమయంలోనే ఈ గందరగోళ పరిస్థితి నుండి బయట పడవచ్చు. మెంటల్ గా టెన్షన్ పెరగకుండా ఆదిలోనే అరికట్టవచ్చు. ఎప్పుడైతే మీకు నచ్చిన పని లేదా, ఏదైనా సమస్య కారణంగా మీరు డిస్టర్బ్ అవుతారో, వెంటనే ఆ అంశం గురించి మీ స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ షేర్ చేసుకోవాలి.
అప్పుడు మీ మనసులోని భారం కొంతలో కొంత తగ్గి కాస్త తేలిక పడుతుంది. లేదంటే మీరు అలా డిస్టర్బ్ అయిన వెంటనే మీకు నచ్చే చోటుకు వెళ్లడం లేదా నచ్చే పనులు చేయడం, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడటం ద్వారా కొంచెం ఆ మూడ్ (పరిస్థితి) నుండి డైవర్ట్ కావచ్చు. లేదా ఆ విషయం గురించి పదేపదే ఆలోచించకుండా ఏదో ఒక పనిలో బిజీగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇలా కొన్ని రకాల పనులు చేయడం వలన మీ మనసును ఇబ్బందికర పరిస్థితి నుండి బయటపడేలా చేయవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి