ప్రతి ఒక్కరి ఆశ, ఆశయం తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మరియు విజయాన్ని అందుకుని అందరి ముందు గర్వంగా నిలబడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందులో అత్యాశ ఏమి లేదు. అయితే సత్యాన్ని గ్రహించడం ముఖ్యం. విజయాన్ని కోరుకోవడం మంచిదే, అయితే విజయం అందుకున్న వెంటనే ఇక అంతా లోకాన్నే గెలిచినట్లు అని ఊహల్లో తేలుతుంటారు కొందరు. విజయం అందుకోగానే ఇక కాలమంతా మన కంట్రోల్ లో ఉన్నట్టు కాదు, భవిష్యత్తు మొత్తం ఆ విజయం మన వెంటే ఉంటుంది అని కూడా కాదు. జయాపజయాలు ఎప్పుడు శాశ్వతం కాదు. అందుకే ఒక్కసారి ఏదో ఓటమి ఎదురైంది కదా అని ఎలా అయితే నిరాశపడి కుంగిపోకూడదో..అదే విధంగా విజయం అందింది కదా అని అన్ని ఇక మన కంట్రోల్ లోకి వచ్చేసాయని పొంగిపోకూడదు.

రెండు సమయాల్లోనూ స్థిరంగా ఉండగలగాలి. సందర్భం ఏదైనా సమయస్ఫూర్తితో ఆలోచించగలిగితే అంతా అనుకూలంగానే అనిపిస్తుంది. గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు. ఓటమి పాలైన వాడు విచారంగా ఉంటాడు. అవి రెండూ జీవితంలో శాశ్వతం కాదని తెలిసిన వాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. దీనర్థం ఏమిటంటే సుఖ దుఃఖాలు, జయాపజయాలు ఇవేవీ జీవితంలో చెప్పి రావు అలాగే స్థిరంగా ఉండిపోవు. ఈ విషయాన్ని నమ్మి , అర్దం  చేసుకునేవాడు ప్రశాంతంగా జీవించగలడు. ప్రతి మనిషి తమ జీవితంలో జరిగే అశాశ్వతమైన అంశాల కోసం ప్రాకులాడకుండా పట్టుదలతో ముందుకు సాగండి.

ఉన్నంతలో సంతోషంగా ఉండగలిగితే  అంతకు మించిన ధనధాన్యాలు లేవు.  ప్రశాంతతకు మించిన ఆనందం మరొకటి లేదు. ఎవరైతే ఈ విషయాన్ని గ్రహించగలరో వారికి ప్రశాంతమైన జీవితం  తప్పక లభిస్తుంది. ఇప్పటికి అయినా వాస్తవాన్ని గ్రహించండి. జీవితం యొక్క పరమార్ధం తెలుసుకోండి. అనవసరంగా అశాశ్వతమైన వాటి కోసం సమయాన్ని వృధా చేసుకోకండి. ఒకసారి ఆలోచించుకోండి మనము బ్రతుకుతున్న ఈ జీవితంలో సంతృప్తిగా ఉన్నామా అని, ఆ తర్వాత మీ ఇష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: