ఈ ప్రపంచంలో మనము ఒక మంచి స్థానంలో ఉండాలి. ఈ సమాజంలో మనకు గుర్తింపు ఉండాలి అని అందరూ పాటుపడతారు. కానీ ఈ మార్గంలో లక్ష్యం అందుకోవాలని ఆకాంక్షతో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ దిశ ను మార్చుకోండి, మీ పొరపాట్లను గుర్తించి సరి చేసుకోండి, లేదంటే చేతులారా మీ లక్ష్యాన్ని మీరే దూరం చేసుకున్నవారవుతారు. కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుని తమ విజయాన్ని అందరి ముందు గర్వంగా చూపిస్తూ సగౌరవంగా జీవించాలని అందరికీ ఉంటుంది. అయితే అందరూ విజయాన్ని అందుకోలేరు. కొందరు మాత్రమే తాము కోరుకున్న తీరాన్ని చేరుకుని సంతోషంగా జీవిస్తారు.

అయితే చాలా మంది కొన్ని పొరపాట్లు చేయడం వలన తమ విజయాలకు దూర మవుతుంటారు. అవేంటో చూద్దాం...

అతిగా నమ్మడం: ఎవరినైనా సరే అతిగా నమ్మడం అనేది కరెక్ట్ కాదు. ఇతరుల సలహా తీసుకోవచ్చు. కానీ తుది నిర్ణయం మాత్రం మీరే బాగా ఆలోచించి తీసుకోవాలి. ఎవరి నిర్ణయానికి వదిలేయరాదు. ఆ వ్యక్తులపై మీకు నమ్మకం ఉండొచ్చు. కానీ మరీ అతిగా విశ్వాసం ఉండరాదు, అలాగే వారు చెప్పింది ఆచరించకపోతే వారేమైనా బాదపడతారేమో అన్న ఆలోచనతో మొహమాటానికి పోయి వారు చెప్పినట్లు గుడ్డిగా ఆచరించండి. మీ మార్గం లోని లోటు పాట్లు మరి ఇంకెవరికి అంతా బాగా తెలిసి ఉండకపోవచ్చు. అలాగే మీ అనుభవం మీ పయనానికి బాటసారి అవుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి.

తొందరపాటు నిర్ణయాలు: ఒక విషయం పై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినపుడు ఖచ్చితంగా ముందు వెనుక ఆలోచన అవసరం. హడావిడిగా తొందరపాటుతో నిర్ణయాన్ని తీసుకోరాదు. ప్రధానంగా ముఖ్య అంశాలపై నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. బాగా ఆలోచించి కానీ ఏ నిర్ణయం తీసుకోకూడదు. నెమ్మదిగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దాని పరిణామం ఆలోచించి తర్వాత తీసుకోవాలి.

ఇలా పైన తెలిపిన రెండు విషయాలలో కరెక్ట్ గా ఉండగలిగితే చాలా వరకు ఇబ్బందులు లేకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: