ఈ పోటీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ కూడా తమ పిల్లలు బాగా చదివి మంచి ప్రయోజకులు అవ్వాలని, అన్నింటా విజయవంతులై మంచి జాబ్ తెచ్చుకుని తమ జీవితం లో సెటిల్ అవ్వాలని అనుకుంటారు. దాదాపు అందరూ తల్లి తండ్రులు ఇలాగే ఆలోచిస్తారు. పిల్లల్ని బాగా చదవండి అని చెబుతుంటారు. చాలా వరకు పిల్లలు కూడా తమ తల్లి తండ్రుల మాట విని బాగా చదువుకోవాలని అనుకుంటారు. ఇక కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే వారి సంగతైతే సరే సరి... గంటల కొద్దీ చదవాల్సి ఉంటుంది.  

అయితే చదవాలని అయితే అనుకుంటారు. కానీ చదువు పై పూర్తి ఏకాగ్రతను మాత్రం పెట్టలేరు. కాసేపు కంటే ఎక్కువ సేపు చదువుపై దృష్టిని పెట్టలేక పోతుంటారు. చదవాలని ఎంతగా అనుకున్నా కొందరు ఎక్కువ టైం చదువుకు కేటాయించలేక సతమతమవుతుంటారు. అయితే అలాంటి వారు కొన్ని సూచనలను పాటించడం వలన ఎక్కువ సేపు చదవడానికి కావాల్సిన ఆసక్తి లభిస్తుంది.

గంటల కొద్దీ చదవాల్సినపుడు మరీ ఎక్కువగా కడుపు నిండా తినకండి, ఎక్కువగా పండ్లను అందులోనూ తాజా పండ్లను తీసుకోండి. చదివే సమయంలో మీ కళ్ళకు పుస్తకానికి మద్య కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోండి.  ఎక్కువ సేపు చదవాలి అనుకున్నప్పుడు వెలుతురు బాగా ఉండే ప్రాంతంలో కూర్చుని ప్రిపేర్ అవ్వండి. అలాగే ఎక్కువ సేపు ఒకేచోట కూర్చుని చ‌ద‌వకుండా.. క‌నీసం 45 నిమిషాల‌కు ఒక‌సారైనా లేచి రెండు రెండు నిమిషాలు అలా నడిచి కాస్త రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత మళ్లీ చదవడం కంటిన్యూ చేయొచ్చు. ఎక్కువ సేపు చదివే సమయంలో అప్పుడప్పుడు మధ్యలో మంచి నీళ్ళు తాగుతూ ఉండండి.

పైన చెప్పిన విధంగా సూచనలు పాటించినట్లయితే ఎక్కువ సేపు చదువుపై ఏకాగ్రత ఉండేలా చేయవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: