చాలా మంది ఎప్పుడూ తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్న ప్రెజెంట్ ని గాలికి వదిలేస్తారు. అస్సలు ఆస్వాదించరు. అనుకున్నది సాధించాలి అని కోరుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోవాలి అని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. అంతటితో ఆగుతారా అనుకున్నది సాధించినా కూడా మళ్ళీ మరొక గోల్ పెట్టుకుని దాని వెనుక పరుగులు తీస్తుంటారు. కానీ ఇలా చేయడం వలన తాము ఏమి కోల్పోతున్నారు అన్న విషయం అస్సలు గుర్తించలేరు. ఎపుడు కష్టపడుతూ బ్రతుకు బండిని లాగుతూ వుంటే ఇక జీవితాన్ని సంతోషంగా అనుభవించేది ఎపుడు, తమ వారితో సరదాగా సమయాన్ని గడిపేది ఎపుడు అన్నది వారికే తెలియాలి .

లక్ష్యాన్ని చేరుకోవడం ఎంత ముఖ్యమో అలాగే జీవితాన్ని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి అన్నారు పెద్దలు. అదే విధంగా విజయాన్ని అందుకునే ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూ జీవితం లోని చిన్న చిన్న సంతోషాలను మిస్ అవ్వకండి. విజయం అందుకోవడం అనేది మీ జీవిత ఆశయం, అలాగే జీవితాన్ని సంతోషంగా జీవించడం మీ హక్కు... దాన్ని మరవకండి. మీరు సంతోషంగా ఉంటూ... మీ తోటి వారిని సంతోషంగా ఉంచండి. అదే అసలైన విజయం అవుతుందని పెద్దలు అంటున్నారు. అంతే కాదు హద్దులు మీరిన లక్ష్యాలు కూడా జీవితం లోని సంతోషాలను చిన్న చిన్న ఆనందాలను దూరం చేస్తాయి .

ఒక లక్ష్యాన్ని ఎంచుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా తప్పటడుగు వేస్తే లక్ష్యాన్ని చేరుకోలేక నానా తంటాలు పడతారు. కాబట్టి ఏదైనా లక్ష్యం ఉన్నప్పటికీ కుటుంబానికి సైతం సమాన ప్రాధాన్యత ఇవ్వండి. మీకు జీవితంలో ఫ్యామిలీ నుండి దొరికే చిన్న చిన్న అనుభూతులను సొంతం చేసుకుంటూ మీ లక్ష్యానికి దగ్గర అవండి .  

మరింత సమాచారం తెలుసుకోండి: