హేయ్.. నేను రొయ్యల పచ్చడి తిన్నా.. చికెన్ పచ్చడి తిన్న.. మటన్ పచ్చడి తిన్న.. ఇప్పుడు ఏంటి కొత్తగా కోడిగుడ్డు పచ్చడి.. కొత్తగా ఉందే.. విచిత్రంగా ఉందే అని అనుకుంటున్నారా? కానీ నిజం. ఈ కోడిగుడ్డు పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది.. ఆ పచ్చడి రుచిని ఆస్వాదించేయండి.. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుంది. ఎలా చెయ్యాలో అనేది ఇక్కడే చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్ధాలు... 

 

కోడిగుడ్లు - డజను, 

 

కారం - పావుకేజీ, 

 

ఉప్పు - 200 గ్రా, 

 

పసుపు - రెండు చెంచాలు, 

 

మెంతులు - చెంచా,  

 

జీలకర్ర - చెంచా, 

 

ఎండుమిర్చి - ఆరేడు, 

 

చింతపండు - పావుకేజీ, 

 

నూనె - పావుకేజీ, 

 

వెల్లుల్లిరెబ్బలు - కొన్ని.

 

తయారీ విధానం... 

 

మెంతుల్ని వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.. కోడిగుడ్లను ఉడికించి పొట్టుతీసి నూనెలో వేయించి పెట్టుకోవాలి. ఓ పాత్రలో కారం, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు, మెంతిపిండి, నూనె తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు వేయించిపెట్టుకున్న కోడిగుడ్లు వేసి మరోసారి కలపాలి. మిగిలిన నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్రతో తాలింపు పెట్టి.. పచ్చడిపై వేసి బాగా కలపాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు అలంకరిస్తే చాలు కోడి గుడ్డు పచ్చడి రెడీ.. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ పచ్చడి రుచిని చూసేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: