పేలు  సమస్య ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అధికంగా బాధిస్తుంటుంది ఈ పేల  సమస్య వలన ఆడవాళ్లు భలే ఇబ్బందులు ఎదుర్కుంటారు.  ఈ పేలు తలవెంట్రుకలను అంటిపెట్టుకొని రక్తాన్ని ఆహారంగా తీసుకుని జీవిస్తూ ఉంటాయి ఓకే చోటా ఉంటే ఇవి ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి ఈ పేల సమస్య వలన తలలో దురద, గోకడం వంటి సమస్యలు ఏర్పడతాయి.అలాగే ఇవి వెంట్రుకలను అంటిపెట్టుకుని చూడడానికి అసహ్యంగా కనిపిస్తాయి.  ఇలాంటి ఇబ్బంది పెట్టే పేల నుండి మన తలను రక్షించుకోవటానికి కొన్ని తేలికైన చిట్కాలు ఉన్నాయి. 

 

 

వెల్లుల్లి మనందరికీ తెలిసిందే ఈ వెల్లుల్లిని మెత్తగా పేస్టుగా చేసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు పట్టించి ఒక అరగంట ఆగిన తర్వాత వేడినీళ్లతో తలంటు స్నానం చేయండి తర్వాత తల ఆరిన తర్వాత దువ్వెన తో దువ్వితే పేలు తలలో నుంచి కింద పడతాయి వెల్లుల్లిలో ఉండే ఘాట్ వలన ఈ పేలు త్వరగా చనిపోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది.రెండో చిట్కా అయినా కర్పూరం కొద్దిగా తీసుకొని కొబ్బరి నూనె ఒక స్పూను ,నిమ్మకాయ సగం ఈ మూడింటి మిశ్రమాన్ని మొత్తంగా కలిపి జుట్టు కుదుళ్ల వరకు అంత అప్లై చేయాలి కొబ్బరి నూనెలో ఉండే సువాసన వల్ల ఈ పేలను తొలగించడంలో కొబ్బరినూనె బాగా పనిచేస్తుంది అలాగే నిమ్మకాయ  చుండ్రు  తగ్గించడంలను, అంట్లు నిర్మూలించడంలో నిమ్మరసం ప్రముఖ పాత్ర వహిస్తుంది కర్పూర వాసన పేలను నిర్మూలిస్తుంది ఇలా అప్లై చేసిన తర్వాత  తలకు  కండువా గాని షవర్ క్యాప్ కానీ పెట్టి ఒక గంట సేపు ఉంచవలెను తర్వాత మన దగ్గర హెర్బల్ షాంపూతో  తలంటు స్నానం చేయవలెను తరువాత దువ్వెన తో తల దువ్వితే పేలు అన్ని రాలి పడతాయి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఏ హాని చేయకుండా నాచురల్ గా ఈ విధంగా పేలను తగ్గించుకోవచ్చు.

 

తర్వాత మూడో చిట్కా అయినటువంటి వైట్ వెనిగర్ తో పేలను ను తొలగించుకోవచ్చు ఈ వైట్ వెనిగర్ ను రాత్రిపూట పడుకునే ముందు గా తలకు బాగా పట్టించి షవర్ క్యాప్ తో కానీ కండవ తో గాని తలకు చుట్టి ఉదయం పూట తలస్నానం చేస్తే చాలా రిలీఫ్ గా ఉంటుంది తర్వాత దువ్వెన తో దువ్వితే పేలు అన్ని కింద పడి పోతాయి ఈ విధంగా ఏ కెమికల్స్ వాడకుండా మన ఇంట్లో న్యాచురల్ గా ఈ పేలను తొలగించుకోవచ్చు 

 

మరింత సమాచారం తెలుసుకోండి: