అమ్మ అవ్వడం అనేది ఆ మహిళకు చాలా సంతోషించాలిసిన సమయం.తల్లికి ఎన్ని ఇబ్బందులు ఎదురయినా గాని కడుపులోని బిడ్డ క్షేమం గురించే ఆలోచిస్తుంది.అయితే గర్భవతికాలంలో ఆ గర్భిణీ స్త్రీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇ గర్భవతి కాలాన్ని మూడు ట్రైమిస్టర్లగా విభజిస్తారు. అయితే ఇప్పుడు రెండవ త్రైమాసికంలో గర్భవతిలో వచ్చే మార్పులు గురించి తెలుసుకుందాం.. !!ఈ టైమ్ ప్రెగ్నెంట్స్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మార్నింగ్ సిక్నెస్ వంటి ప్రాబ్లంస్ పూర్తిగా పోతాయి, లేదా బాగా తగ్గుతాయి. అబార్షన్ అయ్యే ఛాన్స్ కూడా దాదాపు ఉండదు. దాంతో వర్రీ తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ఫేస్ లో ప్రెగ్నెన్సీ గ్లో కనిపించేది కూడా ఈ టైం లోనే. కానీ, ఈ టైం లో కూడా కొన్ని అసౌకర్యాలు ఉంటాయి. అవేమిటో చూడండి.
ప్రెగ్నెన్సీ లో సహజం గానే మలబద్దకం సమస్య ఉంటుంది. సెకండ్ ట్రైమిస్టర్ లో ఇది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఎక్కువగా నీరు తాగుతూ, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉండాలి.




సెకండ్ ట్రైమిస్టర్ లో ఉండే ఇంకో సమస్య గెండెలో మంట. ఏది  కూడా చాలా కామన్ ప్రాబ్లం. ప్రెగ్నెన్సీ టైం లో కనీసం సగం మంది ఈ ప్రాబ్లం తో సఫర్ అవుతారు. పడుకున్నప్పుడూ, కొంచెం ఎక్కువగా తిన్న తరువాత ఈ సమస్య కనపడుతూ ఉంటుంది. కెఫీన్ తగ్గించడం, స్పైసీ, ఆయిలీ ఫుడ్స్ తగ్గించడం దీనికి మంచి మందు. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తింటే ఈ ప్రాబ్లం కనిపించదు.సెకండ్ ట్రైమిస్టర్ లో తీసుకున్న ఫుడ్ త్వరగా అరగదు. దాంతో గ్యాస్ పెరుగుతుంది. గ్యాస్ వల్ల పొట్టలో నొప్పి, పట్టేసినట్లుండడం, తేపులు వంటివి ఫేస్ చేయవలసి ఉంటుంది. కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినడం, తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినడం వంటివి హెల్ప్ చేస్తాయి. డిన్నర్ కీ, నిద్రకీ మధ్య కొంత సమయం ఉంటే ఈ సమస్య అంతగా బాధించదు.అలాగే, హై హీల్స్ కాకుండా మంచి సపోర్ట్ ఇచ్చే చెప్పులు వేసుకోండి.




కొద్దిగా పాదాల వాపు అందరికీ సహజమే. ఇది పెరిగిన వెయిట్ ని సపోర్ట్ చేయడానికి అవసరం. ఎక్కువసేపు కూర్చునో, నిలబడో ఉండకుండా యాక్టివ్ గా ఉండడం వల్ల వాపు తగ్గుతుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కాళ్ళు కొంచెం ఎత్తుగా పెట్టుకోవడం, పడుకున్నప్పుడు పక్కకి తిరిగి పడుకుని కాళ్ళ మధ్య దిండు పెట్టుకోవడం హెల్ప్ చేస్తాయి.
ఈ టైం లో ఒక్కసారి డయాబెటీస్ చెక్ చేయించుకోవడం మంచిది.డాక్టర్ ని కన్సల్ట్ చేయకుండా ఎలాంటి మెడిసిన్ వేసుకోకూడదు.మంచి భోజనం, మంచి నిద్ర, మంచి విశ్రాంతి అవసరం.


మరింత సమాచారం తెలుసుకోండి: