అమ్మ అని పిలిపించుకోవాలని ఎదురుచూడని మహిళ ఉండదు. ఎందుకంటే ఆ పిలుపుకు ఉన్న మహత్యం అలాంటిది మరి. గర్భవతి అని తెలిసిన దగ్గర నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏది తినాలన్నా గాని అలోచించి తింటుంది. అయితే గర్భంతో ఉన్నప్పుడు ఒక్కొక్క గర్భిణీకి ఒక్కొక్క విచిత్రమైన కోరికలు ఉంటాయి. కొంత మందికి బాగా పులుపు తినాలని అనిపిస్తుంది. మరి కొంతమందికి బాగా కారం తినాలని అనిపిస్తుంది. కానీ మరి కొంత మందికి విచిత్రంగా చాక్ పీస్, బలపాలు తినాలని అనిపిస్తుంది. ఆ కోరికతో అవి తినేస్తూ ఉంటారు. కానీ అలా ఏదిపడితే అది తినకూడదు. అలాగే కొంత మందికి బలపాలు చాక్ పీస్లు తినడం అలవాటుగా ఉంటుంది. దీనికి గనుక సరిగ్గా ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే భవిష్యత్‌లో అది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌కి దారి తీయొచ్చు.



అయితే గర్భిణీకి ఉన్న ఈ సమస్యన పీకా అంటారు. ఈ సమస్య ఉన్నవారు బలపాలు, చాక్‌పీస్‌లు తింటారు. వీరికి మట్టీ, చాక్ పీసులు, ఐస్ వంటి వాటిని చూడగానే నోరూరిపోతుంటుంది. ఇది ఒక ఈటింగ్ డిసార్డర్ గా చెప్పొచ్చు.  ఒక్కోసారి బాడీ లో అవసరమైనంత జింక్ లేకపోయినా కూడా ఈ పీకా సమస్య వస్తుంది. చాక్‌పీస్‌లు, బలపాల పెద్ద విష పదార్ధం కాదు. కానీ దాన్ని తినటం మంచిది కాదు. దాని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.ఏది తిన్నాగాని అది ఎక్కువగా తీసుకోకూడదు.ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా.. ముందుగా కడుపులో బిడ్డ గురించి ఆలోచించాలి  



ఇలా బలపాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే  మలబద్ధకం, కడుపులో నులిపురుగులు, ఆకలి లేకపోవడం  వంటి సమస్యలు వస్తాయి. ప్రెగ్నెంట్స్ గానీ, ఫీడింగ్ మదర్స్ కానీ వీటిని తింటే దాని వల్ల వచ్చే నష్టాలు వేరేలా ఉంటాయి. వారికి సరిగా ఆకలి కాక, అన్ని రకాలా ఆహార పదార్ధాలూ తీసుకోక, పోషకాహార లేమి వస్తుంది. ఇది వారికి మాత్రమే కాదు.. పుట్టబోయే పిల్లలకి కూడా మంచిది కాదు  చెబుతున్నారు.  కాబట్టి వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: