
సూపర్ స్టార్ కృష్ణ తాను సినిమాల్లోకి రాకముందే తన సొంత మరదలిని అంటే మహేష్ తల్లి ఇందిరను వివాహం చేసుకున్నారు. ఇందిర ద్వారా కృష్ణకు ఐదుగురు సంతానం. మహేష్ సోదరుడు రమేష్ బాబు, మహేష్ సోదరీమణులు మంజుల, ప్రియదర్శిని, పద్మావతి. ఇక సినిమాలలో తనకు పరిచయమైన విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. తన భర్త నిర్ణయాన్ని తప్పు పట్టని ఇందిరాదేవి ఎప్పుడైతే కృష్ణ రెండో వివాహం చేసుకున్నారో అప్పటి నుంచి పూర్తిగా మీడియా కంట పడడం మానేశారు.
అంతకుముందు అడపాదడపా కృష్ణ సినిమా ఫంక్షన్స్ కు హాజరు అయ్యే ఆవిడ ఆ తర్వాత ఎలాంటి సినిమా ఫంక్షన్స్ కు హాజరు కాలేదు. మహేష్ బాబుకి తల్లి ఇందిర అంటే చాలా ఇష్టం. మహేష్ కూతురు సితార కూడా ఇందిర పోలికలను కలిగి ఉంటుంది, బహుశా మహేష్ అందుకే ఈ ఇద్దరి మీద అత్యంత ప్రేమ కనబరుస్తూ ఉంటారు. మహేష్ ఇప్పటికి కూడా చిన్నపిల్లాడిలా వాళ్ళ అమ్మను అసలు వదిలిపెట్టడు. అయోతే మహేష్ ఇందిరమీద ఎంత ప్రేమ కనబరిచేవాడో చిన్నమ్మ విజయనిర్మలను అంతే అభిమానించేవాడు. ఆమెను కూడా ఎంతో గౌరవంగా చూసేవారు మహేష్. పెద్దగా రాలేదు కానీ, ఒక వేళ ఏదన్నా మహేష్‌బాబు సినిమా ఫంక్షన్ కు ఇందిరాదేవి కనుక వస్తే మహేషే దగ్గరుండి మరీ ఆమె చేయి పట్టుకుని చాలా జాగ్రత్తగా తీసుకువచ్చి ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు.