మన మెదడు చురుగ్గా ఉంటేనే మన శరీరం కూడా ఆరోగ్యం ఉండి అన్నివిధాలుగా సవ్యంగా ఉంటుంది. అయితే మన మెదడు చురుగ్గా ఉండాలంటే అందుకు చిన్నప్పటి నుండే పోషకాహారం, అలాగే అభ్యాసం అవసరం. మన జీవితం అంతా మన పిల్లల కోసమే కష్టపడుతాము. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారి మెదడు చురుగా పనిచేయాలి. అంటే పిల్లలు చిన్న తనం నుండే మెదడును అన్నివిధాలుగా పటిష్టం చేసేందుకు మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఇందులో ముఖ్య పాత్ర తల్లులదే అవుతుంది. ఎందుకంటే పిల్లలను చూసుకోవడం, వారి పెంపకం విషయంలో తల్లులే ఎక్కువగా బాధ్యత వహిస్తుంటారు. అలాంటప్పుడు వారి మెదడు చురుగ్గా ఉండి వారి ఆరోగ్యం, తెలివితేటలు మెరుగ్గా ఉండాలంటే చిన్నప్పటి నుండే వారికిచ్చే ఆహారంపై జాగ్రత్తలు అవసరమని అంటున్నారు నిపుణులు.

అప్పుడే శారీరికంగా,మానసికంగా దృఢంగా ఉంటారని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే పోషకాహార లోపం వలన పిల్లల మెదడు అంత చురుగ్గా ఉండదు అలాగే...వారి జీవన నైపుణ్యాలు కూడా అంత సవ్యంగా ఉండవు అంటున్నారు. దాని కారణంగానే వారి చదువు సంధ్యలు, తెలివి తేటలు సవ్యంగా ఉండవు అని అంటున్నారు. అయితే ఇందు కోసం ఆరోగ్యమైన జీవన విధానం కోసం పిల్లలు జీవన ప్రక్రియలు సరిగ్గా ఉండటం కోసం...శరీరానికి క్యాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఐరన్‌ లు అధికంగా ఉండే ఆహారపదార్ధాలను పిల్లలకు ఎక్కువగా ఇవ్వాలి.

ఈ పోషకాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్దాలను తమ పిల్లలు అందివ్వడం వలన ఆ చిన్నారుల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా శరీర అవయవాలకు సవ్యంగా నియంత్రించగలుగుతుంది.. అలాగే శారీరికంగా దృఢంగా ఉంటారు. చదువులోనూ, మేదస్సులోను ఎప్పుడూ ముందుంటారు. ఇలా చిన్నప్పటి నుండే పోషకాహారం తీసుకోవడం వలన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మరి ప్రతి ఒక్క తల్లి ఈ విషయం తెలుసుకుని దానికి అనుగుణంగా మీ పిల్లలను మార్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: