నాటి కాలంతో పోల్చుకుంటే ఇటీవల వెండితెర, బుల్లితెర అని తేడా లేదు. ఎందుకంటే వెండితెరతో సమానంగా బుల్లితెరపై కూడా ఎంతోమంది నటీనటులు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు బుల్లితెర మీద ఎన్నో టీవీ సీరియల్స్ ప్రసారం అవడమే కాకుండా అనేక కామెడీ షో లు కూడా ప్రసారం అవుతూ, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే బుల్లితెర మీద టీవీ సీరియల్స్ కు ఉన్న క్రేజ్ సినిమాలకు కూడా లేదని చెప్పవచ్చు. సినిమా కేవలం మూడు గంటలు మాత్రమే ఉంటుంది. కానీ సీరియల్ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ మహిళలను కట్టి పడేస్తూ ఉంటాయి. అలాంటి సీరియల్స్ కు  కథ రాయడం లో పెట్టింది పేరు ఓంకార్ పరిటాల. ఈయన ఏదైనా ఒక సీరియల్ కథ రాశారు అంటే అది ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకులను వినోదాన్ని పంచుతుంది. అలాంటి గొప్ప రచయిత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

ఓంకార్ పరిటాల.. విజయవాడ దగ్గర ఉన్న పెనమలూరు అనే గ్రామంలో జన్మించారు. ప్రముఖ రచయితగా, నటుడిగా, పత్రికలలో శీర్షికల రచయితగా, బుల్లితెర టీవీ నటుడిగా ఇలా ఎన్నో రకాలుగా మంచి గుర్తింపు పొందాడు ఓంకార్. తన విద్యాభ్యాసం పూర్తయిన తరువాత మొదట రేడియోలో వార్తలు చదవడం ప్రారంభించాడు. అలా తన ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టి , ఆ తరువాత పత్రికలలో శీర్షికలు రచించడం మొదలుపెట్టాడు.ఇక అక్కడ  మంచి గుర్తింపు రావడంతో బుల్లితెర పైన టీవీ సీరియల్స్ కు రాయడం ప్రారంభించాడు. ఇక్కడ కూడా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించి ఒక మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.

సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను రచనల రూపంలో రాసి,  సీరియళ్ళలో చూపిస్తూ, ప్రజాదరణ బాగా  పొందాడు. నటుడిగా తన విలక్షణమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. స్వాతి పుస్తకంలో వారం వారం ఓంకారం అనే పేరుతో శీర్షిక కూడా విడుదలయ్యేది. ఈయన రచించిన ఆల్ ఇన్ వన్ కూడా మంచి ప్రజాదరణ పొందింది. ఇక ఈయన కొడుకు ఎవరో కాదు బుల్లితెర స్టార్ హీరో నిరుపమ్ పరిటాల. కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి ఫేమ్ ను అందుకున్నాడు.

ఇక నటుడిగా 1990లో వచ్చిన పోలీస్ భార్య, అన్న తమ్ముడు వంటి సినిమాల్లో నటించాడు.  2007 జనవరి 7వ తేదీన గుండెపోటుతో మరణించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: