భారత మార్కెట్లో విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్న తమ బిఎస్6 ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లు జి 310 ఆర్, జి 310 జిఎస్‌‌ల బుకింగ్ ని ప్రారంభించడానికి సిద్ధం అవుతుంది. బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఇండియా భారతదేశంలో మోటార్‌సైక్లింగ్ ఔత్సాహికులలో చాలా బలమైన స్థానాన్ని నిర్మించారు. బిఎమ్‌డబ్ల్యూ జి 310 బైక్‌లతో, పూర్తిగా భిన్నమైన రీతిలో రైడింగ్‌ను అన్వేషించడానికి వేలాది మంది రైడింగ్ ఔత్సాహికులు బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ప్రీమియం ప్రపంచంలోకి ప్రవేశించారు.

ఇక బిఎమ్‌డబ్ల్యూ జి 310 సిరీస్ మోటార్‌సైకిళ్లు పూర్తి ఎల్‌ఈడి లైటింగ్‌తో రీడిజైన్ చేశారు. హెడ్‌ల్యాంప్ క్లస్టర్, కొత్త ఎక్స్‌టెన్షన్స్‌తో రీడిజైన్ చేసిన ఫ్యూయెల్ ట్యాంక్‌తో మునుపటి బిఎస్4 మోడళ్లతో పోల్చుకుంటే వాటి కన్నా మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తాయని తెలిపారు. ఓవరాల్‌గా గమనిస్తే మాత్రం మునపటి వెర్షన్లకు త్వరలో విడుదల కాబోయే బిఎస్ మోడళ్లకు పెద్ద వ్యత్యాసాలు లేకపోవచ్చని తెలుస్తోందని తెలిపారు.

ఇక ఈ రెండు మోటార్ సైకిళ్ళలో బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్‌నే అప్‌గ్రేడ్ చేసి బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా మార్చనున్నారని తెలియజేశారు. ఈ ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లలో బిఎమ్‌డబ్ల్యూ పునర్నిర్మించిన బిఎస్6 అపాచీ ఆర్ఆర్ 310 ఇంజన్‌ను ఉపయోగించుకోవచ్చని అన్నారు.

అయితే బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన 312 సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 34 బిహెచ్‌పి శక్తిని, 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుందని తెలిపారు. ఈ అప్‌డేటెడ్ ఇంజన్ కాకుండా, బిఎస్6 మోడళ్లలో స్లిప్ అసిస్ట్ క్లచ్‌ను కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా ఆఫర్ చేయనున్నారని తెలిపారు.

ఇక జి 310 ఆర్ రోడ్ ట్రాక్ ఉపయోగం కోసం తయారు చేసిన పెర్ఫార్మెన్స్ టైర్లతో వస్తుందని అన్నారు. కాగా జి 310 జిఎస్ డ్యూయెల్ పర్పస్ టైర్లను కలిగి ఉండి. ఇది ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ ఈ సెగ్మెంట్లోని కెటిఎమ్ డ్యూక్ 390, హోండా సిబి 300ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: