ఫేమస్ టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి లగ్జరీ బైక్స్ అండ్ కార్స్ ని అందించడంలో దీని స్టైలే వేరు. ఇక బిఎమ్ డబ్ల్యూ మోటోరాడ్ తన కంపెనీ నుంచి కొత్తగా అప్‌డేట్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ ఇంకా బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ అడ్వెంచర్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. ఇక ఈ రెండు బైకులు కూడా బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఇప్పటికే చాలా అప్‌డేట్ చేయబడ్డాయి. ఇండియా మార్కెట్లో విడుదలైన ఈ బైక్స్ గురించి మరింత సమాచారం గురించి తెలుసుకోండి.ఇక బిఎమ్‌డబ్ల్యూ తన ఆర్ 1250 జిఎస్‌ ధరను రూ. 20.45 లక్షలకు విడుదల చేయగా, ఆర్ 1250 జిఎస్ అడ్వెంచర్‌ ధరను రూ. 22.40 లక్షలకు మార్కెట్లో విడుదల చేయడం జరిగింది.

ఇక బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్‌ను ఇంతకు ముందు రూ. 20.45 లక్షలకు అమ్ముడయ్యేది.ఇక ప్రస్తుతం ఈ బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ అడ్వెంచర్ బైక్ ధర ఇప్పుడు అప్పటి కంటే రూ. 5 వేలు పెరిగింది. ఇక ఈ కంపెనీ త్వరలో '40 ఇయర్ జిఎస్ 'వెర్షన్ కూడా త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు నివేదికల ద్వారా సమాచారం తెలుస్తోంది.ఇక బిఎమ్‌డబ్ల్యూ జిఎస్ లైనప్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా  ఈ బైక్ ను ప్రవేశపెట్టనుంది.ఇక ఈ స్పెషల్ ఎడిషన్ ధరను ఇంకా అధికారికంగా కంపెనీ వెల్లడించలేదు.కానీ ఈ బైక్ దాని పాత మోడల్స్ కంటే కూడా ఎక్కువ ధర కలిగి ఉండే అవకాశం ఉంటుందట.ఇండియాలో బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బైక్ హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా ఇంకా త్వరలో ప్రారంభించబోయే డుకాటీ మల్టీస్ట్రాడా వి 4 వంటి వాటికీ పోటీగా ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బైక్ మునుపటిలాగా ఆర్ 1250 జిఎమ్ ప్రో ఇంకా ఆర్ 1250 జిఎస్ అడ్వెంచర్ ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: