సినిమా ప్రపంచం అంటేనే అందాల జాతర అని చెప్పాలి. ఎటు చూసినా అందమైన హీరోయిన్ లతో కళకళలాడే పరిశ్రమ ఇది. అయితే వీరి వ్యక్తిగత జీవితం అందరిలాగా సాఫీగా జరగదు... అంటే అందరిదీ అని కాదు. కొందరి జీవితంలో డబ్బు, హోదా, విలాసవంతమైన బ్రతుకు ఉన్నా సంసారం జీవితంలో తృప్తిగా ఉండరు. అంటే... భర్త, పిల్లలు ఒక కుటుంబం అంటూ ఉండదు. ఏకాకిగా తమ జీవితాన్ని వెళ్లదీస్తూ ఉంటారు. ఈ లిస్ట్ లో చాలా మంది హీరోయిన్ లు ఉన్నారు. వయసు నలభై యాభై అవుతున్న పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి హీరోయిన్ లలో ఒకరే సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్. ఈమె బాలీవుడ్ కి చెందిన హీరోయిన్ అయినా తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. కానీ ఇక్కడ సక్సెస్ కాలేదు.

బద్రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది... నరసింహుడు మరియు నాని సినిమాలు చేసి బాలీవుడ్ లోనే సెటిల్ అయింది. ప్రస్తుతం ఈమెకు 45 సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే దీని వెనుక ఒక పెద్ద కథ ఉందని తెలుస్తోంది. అమీషా తన కెరీర్ లో ఇద్దరితో లవ్ ఎఫైర్ నడిపిందట. అయితే వారిలో హాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మొదట ఉన్నాడు. అమీషా పటేల్ ఇతనితో కహోనా ప్యార్ హై లో నటించింది. ఆ సమయంలోనే అమీషా తనతో ప్రేమలో పడిందట. అప్పట్లో దీనికి సదంబంధించిన వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు వ్యాపార వేత్తలతో ప్రేమాయణం సాగించింది అట.

ఇలా మొత్తం ముగ్గురితో లవ్ లో పడినా ఎవరితోనో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగలేకపోయింది. అందుకే ఈ రేలషన్ ల మీద నమ్మకం లేక జీవితంలో పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది అమీషా పటేల్.  

మరింత సమాచారం తెలుసుకోండి: