పెరుతో ఈ కారు రోదసీ ప్రయాణానికి అనుకునేరు. ప్రపంచ వ్యాప్తంగా ధారుణమైన ట్రాఫిక్ లో నిరంతరం నిండి ఉండే నగర రోడ్లపై ఆ ట్రాఫిక్ సమస్యల నదిగమించేందుకు ముఖ్యంగా యువతకోసం కాస్త ప్రశాంతంగా ఇద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటూ, కాఫీ తాగుతూ వ్యాహ్యాళి కి తన షీ తో వెళ్ళేందుకు నిజమైన షికార్...షి తో కార్లో తిరిగేందుకు ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ కార్లా తయారీ సంస్థ కొత్తగా తయారు చేసి వెలుగులోకి తెచ్చిన కారే "స్పేస్ కార్" దీనితొ రహదార్ల పై నడిపేటప్పుడుగాని, ఆఫీస్ లో పార్కింగ్ కు గాని, ఇంట్లో పార్కింగ్ కాని పెద్ద సమస్య కాదు. అంతేకాదు ఈ కారులో ఇద్దరికి సరిపడా అతిదగ్గరగా కూర్చొనే సదుపాయముంది. ఇది "ఒంటిని -ఒంటిని కలిపి ఇంటిమసీ" పెంచుతుంది.


ఇప్పటికే టెస్లా - గూగిల్ కలసి రూపొందించిన డ్రైవర్ అవసరం లేని కార్లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. జెనరల్ మోటార్స్ ర్రూపొందించిన షికార్ "ఎన్.వి" రోడ్లపై కెక్కితే ఆ మజాయే వేరు. ట్రాఫిక్ సమయం సమస్య మటుమాయం అవుతుందన వచ్చు. ఈ కారు దేహమంతా సెన్సర్ల తో నిండి అమోఘమైన ఇంటర్నెట్ సదుపాయాలతో, పరిసరాలని పరికిస్తూ దిశ దశలను మార్చుకుంటూ వెళ్ళగలదు. ఆంబులెన్స్,


పోలీస్ వాహనాలను తన సెన్సర్లతో గుర్తించ గలదు. అంతేకాదు కొన్ని కారు బాగాలు ఫోల్డబుల్ గా ఉండటంతో కొద్ది స్పేస్ లో అతి కొద్ది భాగాన్ని పార్కింగ్కు వాడుకొనే సదుపాయం ఒక అద్భుత ప్రయోగమే. హాట్స్ ఆప్ టు జెనరల్ మోటార్స్.


ట్రాన్-స్పొర్ట్ కోసం - స్పేస్ సేవింగ్ ట్రక్  

పలకరిసే పులకరించే ప్రయాణ సాధనమే కాదు దీని రూపం కడు రసాత్మకం. దీనిలో ప్రయాణం రసరమ్యం కావచ్చు. కొనటానికి సిద్ధం అవండి. ఏ క్షణాన్నైనా మార్కెట్ లోకి రావచ్చు. కొంచేం రేట్ ఎక్కువే ఉండొచ్చు. అయినా ఇన్ని సదుపాయాలు...మీరు ఇరుక్కొని కూర్చుంటే మేడం కోపం .... సారీ! చిరు కోపం మాయమవ్వచ్చు. "కలిసి కూర్చుంటే కలదు సుఖం"

మరింత సమాచారం తెలుసుకోండి: