వెస్పా నుండి వస్తున్న మోస్ట్ ఎక్స్ పెన్సివ్ స్కూటర్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రఖ్యాతగాంచిన పియాజియో మోటార్స్ నుండి వచ్చిన వెస్పా మరో సరికొత్త మోడల్.. అత్యంత ఆకర్షణీయంగా వెస్పా 946 ఎంపోరియో అర్మని స్కూటర్ ను అక్టోబర్ 25న లాంచ్ చేస్తున్నారు. దాదాపు 130 సంవత్సరాల దగ్గర అనుభవం ఉన్న మోటార్ కంపెనీ పియాజియో నుండి తమ ఉత్పత్తుల ప్రతిష్టతను పెంచే దిశగా వెస్పా కొత్త మోడల్స్ తో వస్తుంది.

ఇక 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనలో ఉంచిన ఈ వెస్పా 946 అప్పటికే చూపరులను బాగా ఆకట్టుకుంది. అడ్వాన్సెడ్ స్పెషల్ ఫ్యూచర్స్ తో వస్తున్న ఈ వెస్పాతో మీ ప్రయాణం మరింత సౌలభ్యంగా అనిపిస్తుంది. 125 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ స్కూటర్ 11.9పిఎస్ 10.3 ఎన్.ఎం టార్క్ ఇంజిన్ సామర్ధ్యంతో వస్తుంది. ఇక దీని ధర 10 లక్షల రూపాయలు. ఇండియాలో అత్యంత భారీ ధర కలిగిన స్కూటర్స్ లో వెస్పా 946 ఉంటుంది.